విజయవాడ చర్చిలో క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్న చంద్రబాబు

By narsimha lodeFirst Published Dec 25, 2019, 12:18 PM IST
Highlights

క్రిస్మస్ వేడుకల్లో ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు బుధవారం నాడు పాల్గొన్నారు. 

అమరావతి: క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని  విజయవాడలోని నిర్మలా కాన్వెంట్ సమీపంలోని సెయింట్ పాల్స్ కతెడ్రల్ చర్చ్ లో క్రిస్మస్ సందర్భంగా ప్రార్ధనలో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు బుధవారం నాడు  పాల్గొన్నారు.

క్రిస్మస్ పండుగ సందర్భంగా చర్చిలో ప్రార్ధనల్లో పాల్గొన్నారు చంద్రబాబు. ఆ తర్వాత కేక్‌ కట్ చేశారు బాబు. కేక్ కట్ చేసి భక్తులకు పంచిపెట్టారు చంద్రబాబు. ప్రతిఒక్కరికీ చంద్రబాబునాయుడు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. 

రెండో దఫా తాను ఈ  చర్చికి వచ్చినట్టుగా చంద్రబాబు గుర్తు చేసుకొన్నారు. ఒక పవిత్ర సందేశం అందిచిన క్రీస్తు జన్మ దిన వేడుక లో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందన్నారు.దయ, కరుణ, ఇలాంటి దివ్య సందేశాలు క్రిస్మస్ సందేశమన్నారు. మంచిని గుర్తించడం, గౌరవించడం, బైబిల్ లో పొందుపరిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

క్రిస్మస్ రోజున పవిత్ర మైన ప్రదేశంలో ఉండటం ఆనందంగా ఉందన్నారు.యేసు ఇచ్చిన సందేశాలు మానవాళి రక్షణ కు నిరంతరం ఉపయోగపడతాయన్నారు.మనిషిని మనిషిగా గుర్తించడం సమస్య కు పరిష్కార మార్గాలు బైబిల్‌లో  ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

మంచి కోసం , ప్రజల క్షేమం కోసం ప్రార్ధనలు చేసినట్టుగా తెలిపారు..అందరనీ చల్లగా చూస్తూ కరుణ చూపాలని ప్రభువును కోరుకున్నట్టుగా చంద్రబాబు తెలిపారు. టిడిపి హయాంలో క్రిస్మస్ కానుకులు ఇచ్చాం,  చర్చిలకు ఆర్దిక సహాయం చేశామని చంద్రబాబునాయుడు ఈ సందర్భంగా ప్రస్తావించారు. క్రైస్తవ సోదరుల‌కు టిడిపి అండగా ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. 


 

click me!