కారణమిదీ:రోజా కుటుంబసభ్యులకు బాలకృష్ణ ఫోన్

Published : Apr 01, 2021, 11:03 AM IST
కారణమిదీ:రోజా కుటుంబసభ్యులకు బాలకృష్ణ ఫోన్

సారాంశం

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ నగరి ఎమ్మెల్యే రోజా ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు.  

అమరావతి: హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ నగరి ఎమ్మెల్యే రోజా ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు.ఎమ్మెల్యే రోజా కుటుంబసభ్యులకు బాలకృష్ణ గురువారం నాడు ఫోన్ చేశారు.  ఈ ఏడాది మార్చి 27వ తేదీన  రోజా చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఏడాది క్రితమే ఆమెకు ఆపరేషన్ జరగాల్సి ఉందని కుటుంబసభ్యులు చెప్పారు.

ఎన్నికలు, కరోనా కారణంగా ఆపరేషన్ వాయిదా పడినట్టుగా వారు చెప్పారు. మార్చి చివరి వారంలో ఆమె ఆసుపత్రిలో చేరారు. ఆమెకు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ విషయాన్ని రోజా భర్త సెల్వమణి కూడ ధృవీకరించారు.రోజాకు రెండు శస్త్రచికిత్సలు జరిగిన విషయం తెలుసుకకొన్న హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ రోజా కుటుంబసభ్యులకు ఫోన్ చేశారు.రోజా ఆరోగ్య పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకొన్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకొన్నారు.

ఇదిలా ఉంటే బాలకృష్ణతో కలిసి రోజా కొన్ని సినిమాల్లో నటించారు. తొలుత రోజా టీడీపీలోనే ఉండేది. చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రోజా టీడీపీని వీడి కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత వైసీపీలోకి వచ్చారు.2014, 2018 ఎన్నికల్లో నగరి అసెంబ్లీ స్థానం నుండి రోజా వరుసగా విజయాలు సాధించారు.
 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu