ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నీలం సహానీ బాధ్యతల స్వీకరణ

By narsimha lodeFirst Published Apr 1, 2021, 9:57 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా  నీలం సహానీ  గురువారం నాడు బాధ్యతలు స్వీకరించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా  నీలం సహానీ  గురువారం నాడు బాధ్యతలు స్వీకరించారు.

ఏపీ ఎస్ఈసీగా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్  మార్చి 31వ తేదీన పదవీ విరమణ చేశారు.నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ విరమణ చేయనున్నందున  కొత్త ఎస్ఈసీ పదవి కోసం ముగ్గురు రిటైర్డ్ అధికారుల పేర్లను ఏపీ ప్రభుత్వం గవర్నర్ కు గత మాసంలో పంపింది.

నీలం సహానీ, ప్రేమచంద్రారెడ్డి, శ్యామ్యూల్ ల పేర్లను ఏపీ ప్రభుత్వం గవర్నర్ కు పంపింది.  అయితే నీలం సహానీ వైపే గవర్నర్ మొగ్గు చూపారు.రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా నీలం సహానీ గురువారంనాడు బాధ్యతలు స్వీకరించారు.  ఇవాళే పరిషత్ ఎన్నికలకు సంబంధించి కొత్త ఎన్నికల సంఘం కమిషనర్ నీలం సహానీ  నోటీఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది.ఈ ఎన్నికల విషయమై ఎన్నికల సంఘం కార్యదర్శితో పాటు ఇతర అధికారులతో సహానీ భేటీ కానున్నారు.

గతంలో  ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహానీ  పనిచేశారు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా  జగన్ సర్కార్ ఆమెను నియమించింది.అయితే ఏపీ ఎస్ఈసీగా నియమించడంతో రాష్ట్ర ప్రభుత్వ అడ్వైజరీ పోస్టుకు సహానీ రాజీనామా చేసింది.

click me!