తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ ఆవరణలో గురువారం నాడు ఉదయం రెండు నాటు బాంబులు పేలాయి. దీంతో అక్కడే ఉన్న ఓ శునకం చనిపోయింది.
విషయం తెలుసుకొన్న పోలీసులు సంఘటన స్థలంలో తనిఖీలు చేస్తున్నారు.
తిరుపతి: తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ ఆవరణలో గురువారం నాడు ఉదయం రెండు నాటు బాంబులు పేలాయి. దీంతో అక్కడే ఉన్న ఓ శునకం చనిపోయింది.
విషయం తెలుసుకొన్న పోలీసులు సంఘటన స్థలంలో తనిఖీలు చేస్తున్నారు.
ఎస్వీ యూనివర్శిటీ క్యాంపస్ ఆవరణలోని ఐ బ్లాక్ సమీపంలో ఇవాళ ఉదయం రెండు నాటు బాంబులు పేలాయి. అడవి పందుల కోసం ఈ నాటు బాంబులను ఏర్పాటు చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నాటు బాంబులు పేలడంతో ఓ కుక్క, పంది అక్కడికక్కడే మరణించాయి. బాంబు పేలడంతో విన్పించిన శబ్దంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.
ఈ నాటు బాంబులను ఎవరు ఇక్కడ అమర్చారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. నాలు బాంబులను అమర్చిన వారికి ఆ బాంబులు ఎక్కడి నుండి వచ్చాయనే విషయాలపై కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. బాంబు పేలుడు సంబవించిన సమయంలో ఈ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే కుక్క, పంది మరణించాయి.