పల్నాడు : టీడీపీ నేతలు వస్తేనే అంత్యక్రియలు.. జల్లయ్య మృతదేహాన్ని తీసుకోని కుటుంబ సభ్యులు

Siva Kodati |  
Published : Jun 04, 2022, 04:13 PM ISTUpdated : Jun 04, 2022, 04:15 PM IST
పల్నాడు : టీడీపీ నేతలు వస్తేనే అంత్యక్రియలు.. జల్లయ్య మృతదేహాన్ని తీసుకోని కుటుంబ సభ్యులు

సారాంశం

శుక్రవారం ప్రత్యర్థుల చేతిలో హత్యకు టీడీపీ నేత జల్లయ్య అంత్యక్రియల నేపథ్యంలో పల్నాడు జిల్లా రావులపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేతలు వస్తేనే అంత్యక్రియలు నిర్వహిస్తామంటూ జల్లయ్య కుటుంబ సభ్యులు తేల్చిచెబుతున్నారు.   

పల్నాడు జిల్లా (palnadu district) రావులపురంలో (ravula puram) తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. నిన్న ప్రత్యర్ధుల దాడిలో హత్యకు గురైన జల్లయ్య మృతదేహాన్ని పోస్ట్‌మార్టం తర్వాత గ్రామానికి తీసుకొచ్చారు. అయితే జల్లయ్య మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తీసుకోలేదు. పల్నాడు టీడీపీ (tdp) నేతలు వచ్చే వరకు అంత్యక్రియలు చేసేది లేదంటూ మృతదేహన్ని తీసుకోవడానికి ససేమిరా అన్నారు. మరోవైపు రావులపురానికి టీడీపీ నేతలు రాకుండా ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. 

అంతకుముందు నరసరావుపేట (narasaraopet) ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. శుక్రవారం ప్రత్యర్థుల దాడిలో మరణించిన టీడీపీ నేత జల్లయ్య అంత్యక్రియల నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు  ఏర్పాటు చేశారు. పలువురు టీడీపీ నేతలు నరసరావుపేటకు బయలుదేరడంతో.. వారు అక్కడికి చేరుకోకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. మరికొందరు నేతలను హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. అయితే జల్లయ్య అంత్యక్రియలలో పాల్గొని తీరతామని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీంతో నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 

Also Read:నరసరావుపేటలో ఉద్రిక్తత... జల్లయ్య అంత్యక్రియలకు టీడీపీ నాయకులు.. ఎక్కడికక్కడే అడ్డుకుంటున్న పోలీసులు..

నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన టీడీపీ ఇన్‌చార్జ్ చదలవాడ అరవింద్ బాబును పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తేలుకుంట్లలో యరపతినేని శ్రీనివాసరావును హౌస్ అరెస్ట్ చేశారు. విజయవాడలో టీడీపీ నేత బుద్దా వెంకన్నను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆయన ఇంటివద్దే నిరసన వ్యక్తం చేస్తున్నారు. పొందుగుల వద్ద కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావులను అరెస్ట్ చేసిన పోలీసులు.. దాచేపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సంతమాగులూరు వద్ద బీద రవిచంద్రను అడ్డుకున్న పోలీసులు.. వినుకొండ పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో నరసరావుపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

అయితే పోలీసులు తనను ఇంటి ముందే అడ్డుకోవడంపై నక్కా ఆనంద బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ కారణం తో నన్ను ఆపుతున్నారో సమాధానం చెప్పాలని పోలీసులను కోరారు. అక్రమంగా తనను నిర్బంధిస్తే కోర్టులో పిటిషన్ వేస్తానని చెప్పారు. వైసీపీ నేతలు చెప్పినట్లు పోలీసులు ఆడితే ఇబ్బందులు పడతారని అన్నారు. పట్టపగలే హత్య చేస్తుంటే పోలీసులు ఏం చేయడం లేదన విమర్శించారు. పరామర్శలకు వెళ్లే తమను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం అని మండిపడ్డారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్