పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో రివర్స్ టెండరింగ్ విషయంలో ఏపీ హైకోర్టు జగన్ సర్కార్ కు షాకిచ్చింది.
అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో రివర్స్ టెండరింగ్ కు జగన్ సర్కార్ కు హైకోర్టు షాకిచ్చింది.జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణపనులను రివర్స్ టెండరింగ్ పై ముందుకు వెళ్లకూడదని హైకోర్టు గురువారం నాడు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
రివర్స్ టెండరింగ్ ను నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.రివర్స్ టెండరింగ్ పనులను నిలిపివేయాలని కూడ సూచించింది.జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనుల విషయంలోనే రివర్స్ టెండరింగ్ పనులకు వెళ్లకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. పోలవరం హెడ్ వర్క్స్ విషయంలో ఈ తీర్పుకు సంబంధం లేదు.
పూర్తిస్థాయి ఉత్తర్వులు వచ్చే వరకు జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనులను ఇతరులకు కట్టబెట్టవద్దని హైకోర్టు సూచించింది.పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో తమకు కేటాయించిన కాంట్రాక్టును రద్దు చేస్తూ రివర్స్ టెండరింగ్ పనులను పిలవడంపై నవయుగ కంపెనీ ఈ నెల 20వ తేదీన హైకోర్టును ఆశ్రయించింది.
పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టు పనులను నవయుగ కంపెనీకి కేటాయించారు. అయితే ఈ ప్రాజెక్టు పనులు ఇంతవరకు పూర్తి కాలేదు. ఈ నెల 17వ తేదీన పోలవరం హెడ్ వర్క్స్, జలవిద్యుత్ కేంద్రాల పనులకు ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండర్లను పిలిచింది. రూ. 4,900 కోట్లతో ఈ పనులను చేపట్టనున్నారు.
పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్ కు రూ. 1800 కోట్లు, జలవిద్యుత్ ప్రాజెక్టు పనులకు 3100 కోట్లకు టెండర్లను ఆహ్వానించారు.2015-16 ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం రివర్స్ టెండర్లను ఆహ్వానించారు.
నవయుగ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం నాడు హైకోర్టు విచారించింది. ఏజీ జెన్‌కో తమకు స్థలం చూపని కారణంగానే జల విద్యుత్ ప్రాజెక్టు పనులు ఆలస్యమైనట్టుగా నవయుగ కంపెనీ హైకోర్టుకు తెలిపింది. తమ కంపెనీ ఇప్పటివరకు అత్యుత్తమంగా ప్రాజెక్టు పనులు నిర్వహించినట్టుగా ఆ కంపెనీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
ఏపీ జెన్ కో స్థలం చూపకుండా ఆలస్యం చేస్తే ఆ తప్పు తమది ఎలా అవుతుందని నవయుగ కంపెనీ కోర్టులో వాదించింది. ఇదిలా ఉంటే ఏపీ జెన్ కో స్థలం ఇవ్వకుండా ఆలస్యం చేస్తే కాంట్రాక్టు ఎందుకు రద్దు చేయకూడదని కోర్టులో ప్రభుత్వ లాయర్ నవయుగ కంపెనీ ప్రశ్నించారు
సంబంధిత వార్తలు
తగ్గని జగన్: పోలవరం అథారిటీకి కౌంటర్
పోలవరంపై నవయుగ పిటిషన్: వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్
పోలవరం: జగన్ సర్కార్ నిర్ణయంపై కోర్టుకెక్కిన నవయుగ
జగన్‌కు షాక్: రివర్స్ టెండరింగ్‌పై పీపీఏను నివేదిక కోరిన కేంద్రం
సీఈఓ లేఖ బేఖాతరు: పోలవరం పనులకు రివర్స్ టెండర్ల ఆహ్వానం
రివర్స్ టెండరింగ్ పై సీఈఓ లేఖ: జగన్ నిర్ణయంపై ఉత్కంఠ
నష్టమే: రివర్స్ టెండరింగ్‌పై జగన్ సర్కార్ కు జైన్ లేఖ
సీఈవో హెచ్చరికలు బేఖతారు: పోలవరంపై మడిమ తిప్పని జగన్
రీటెండరింగ్ వద్దు, నవయుగే ముద్దు: సీఎం జగన్ కు సీపీఐ రామకృష్ణ లేఖ
జైన్ షాక్: జగన్ రివర్స్ టెండరింగ్ తడిసి మోపెడు