డాక్టర్ సుధాకర్ ఇష్యూ: వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి హైకోర్టు నోటీసులు

By telugu teamFirst Published May 29, 2020, 12:57 PM IST
Highlights

డాక్టర్ సుధాకర్ కేసును సిబిఐకి అప్పగిస్తూ తాము జారీ చేసిన ఆదేశాలపై అసభ్యంగా మాట్లాడారంటూ హైకోర్టు వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. సుధాకర్ పై పోలీసులు దాడి చేశారనే ఆరోపణ వచ్చిన విషయం తెలిసిందే.

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. డాక్టర్ సుధాకర్ కేసును సిబిఐకి అప్పగిస్తూ అసభ్యకరమైన ఆరోపణలు చేశారనే ఆరోపణపై హైకోర్టు అమర్నాథ్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. 

విశాఖపట్నం నడిరోడ్డులో అర్థనగ్నంగా డాక్టర్ సుధాకర్ న్యూసెన్స్ చేశాడనే ఆరోపణపై పోలీసులు ఆయనను ఆరెస్టు చేశారు. ఆయన చేతులను వెనక్కి విరిచి కట్టడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. పోలీసులపై తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేసింది. ఆ కేసును హైకోర్టు సిబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

Also Read: ఆ మందులపై అనుమానం.. పిచ్చివాడిగా మార్చే యత్నం: హైకోర్టులో సుధాకర్ పిటిషన్

డాక్టర్ సుధాకర్ కేసులో ప్రభుత్వంపై విశ్వాసం లేదని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఎనిమిది వారాల్లో విచారణ పూర్తి చేయాలని కూడా హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 16వ తేదీన డాక్టర్ సుధాకర్ విశాఖపట్నం రోడ్డుపై అర్థనగ్నంగా ప్రత్యక్షమయ్యాడు. మద్యం మత్తులో సుధాకర్ అనుచితంగా ప్రవర్తించారని పోలీసులు ఆరోపించారు. 

ఆ ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే హైకోర్టుకు లేఖ రాశారు. ఆ లేఖను పిటిషన్ హైకోర్టు స్వీకరించింది. డాక్టర్ సుధాకర్ మీద పోలీసులు దాడి చేశారని అనిత ఆ లేఖలో ఆరోపించారు. 

Also Read: సీబీఐ చేతుల్లోకి డాక్టర్ సుధాకర్ కేసు: హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించనున్న ఏపీ సర్కార్

కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులకు కనీసం మాస్కులు కూడా లేవని, ప్రభుత్వం వాటిని అందించడం లేదని సుధాకర్ ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. దాంతో అతన్ని విధులనుంచి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆయన విశాఖపట్నం రోడ్డుపై ప్రత్యక్షమయ్యారు.

click me!