డిసెంబర్ 11 నుంచి.. ఫిబ్రవరి 2 వరకు 6 విడతలుగా 75 అసెంబ్లీ, 16 ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది జగన్ పార్టీ. వారి పూర్తి వివరాలు, ఎవరెవరు, ఎక్కడెక్కడినుంచి పోటీ చేస్తున్నారో చూడండి.
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ తాజాగా పదిమందితో కూడిన ఆరో జాబితాను విడుదల చేసింది. ఇంకొన్ని జాబితాలు ఉండొచ్చని అనుకుంటున్నారు. ఇప్పటివరకు అధికార వైసీపీ16 ఎంపీ, 75 ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 9 ఎంపీ, వంద ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించాలి.
ఇంకా ప్రకటించాల్సి ఉన్న 9 ఎంపీ సీట్లో ముగ్గురు సిట్టింగులు కన్ ఫం అని సమాచారం. 3 సిట్టింగుల్లో.. రాజంపేటనుంచి మిథున్ రెడ్డి, బాపట్ల ఎంపీ నందిగామ సురేష్, కడప ఎంపీ అవినాష్ లు ఉన్నారు. అంటే ఇంకో ఆరుగురిని మాత్రమే ప్రకటించాల్సి ఉంది.
ఇక మిగిలిన 100 ఎమ్మెల్యే అభ్యర్థుల విషయానికి వస్తే.. వందలో 50మంది సిట్టింగులకే టికెట్లు ఇవ్వనున్నారట. మిగతా 50లో బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు అధికంగా ఉన్నారు. మార్పులు, చేర్పులు వీరిలోనే ఎక్కువగా జరుగుతాయని సమాచారం. ఇందులో కూడా బీసీలకు అధిక ప్రాధాన్యం ఉండనుందని తెలుస్తోంది.
ఈ క్రమంలో ఇప్పటివరకు వైసీపీ ఖారారైన అభ్యర్థుల పూర్తి జాబితా ఇది...
వైసిపి మొదటి లిస్టులో అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలుగా ఫైనల్ అయిన వారు వీరే..
నెం. | నియోజకవర్గం | అభ్యర్థి |
1 | ప్రతిపాడు (ఎస్సీ) | బాలసాని కిరణ్ కుమార్ |
2. | కొండేపి (ఎస్సీ) | డాక్టర్ ఆదిమూలపు సురేష్ |
3. | వేమూరు (ఎస్సీ) | వరికూటి అశోక్ బాబు |
4. | తాడికొండ | మేకతోటి సుచరిత |
5. | సంతనూతలపాడు | డాక్టర్ మేరుగు నాగార్జున |
6. | చిలకలూరిపేట | మల్లెల రాజేష్ నాయుడు |
7. | గుంటూరు పశ్చిమ | విడుదల రజిని |
8. | అద్దంకి | పాణెం హనిమిరెడ్డి |
9. | మంగళగిరి | గంజి చిరంజీవి |
10. | రేపల్లె | ఈ వూరు గణేష్ |
11. | గాజువాక | వరికూటి రామచంద్రరావు |
రెండో జాబితాలో..
నెం. | నియోజకవర్గం | అభ్యర్థి |
1. | అనంతపురం (ఎంపీ) | మాల గుండ్ల శంకరనారాయణ |
2. | హిందూపురం (ఎంపీ) | జోలదరాశి శాంత |
3. | అరకు (ఎంపీ) (ఎస్సీ) | కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి |
4. | రాజాం ( ఎస్సీ) | తాలె రాజేష్ |
5. | అనకాపల్లి | మలసాల భరత్ కుమార్ |
6. | పాయకరావుపేట ( ఎస్సీ) | కంబాల జోగులు |
7. | రామచంద్రపురం | పిల్లి సూర్యప్రకాష్ |
8. | పి. గన్నవరం ( ఎస్సీ) | విప్పర్తి వేణుగోపాల్ |
9. | పిఠాపురం | వంగా గీత |
10. | జగ్గంపేట | తోట నరసింహం |
11. | ప్రతిపాడు | వరుపుల సుబ్బారావు |
12 | రాజమండ్రి సిటీ | మార్గాని భరత్ |
13. | రాజమండ్రి రూరల్ | చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ |
14. | పోలవరం (ఎస్టి) | తెల్లం రాజ్యలక్ష్మి |
15. | కదిరి | బిఎస్ మక్బూల్ అహ్మద్ |
16. | ఎర్రగొండపాలెం ( ఎస్సీ) | తాటిపర్తి చంద్రశేఖర్ |
17. | ఎమ్మిగనూర్ | మాచాని వెంకటేష్ |
18. | తిరుపతి | భూమన అభినయ్ రెడ్డి |
19. | గుంటూరు ఈస్ట్ | షేక్ నూరి ఫాతిమా |
20. | మచిలీపట్నం | పేర్ని కృష్ణమూర్తి |
21. | చంద్రగిరి | చెవిరెడ్డి మోహిత్ రెడ్డి |
22. | పెనుగొండ | కె.వి. ఉషా శ్రీ చరణ్ |
23. | కళ్యాణదుర్గం | తలారి రంగయ్య |
24. | అరకు (ఎస్టీ) | గొడ్డేటి మాధవి |
25. | పాడేరు (ఎస్టీ) | మత్స్యరాస విశ్వేశ్వర రాజు |
26 | విజయవాడ సెంట్రల్ | వెల్లంపల్లి శ్రీనివాసరావు |
27. | విజయవాడ వెస్ట్ | షేక్ అసిఫ్ |
వైసీపీ మూడో జాబితా...
నెం. | నియోజకవర్గం | అభ్యర్థి |
1. | శ్రీకాకుళం (ఎంపీ) | పేరాడ తిలక్ |
2. | విశాఖపట్నం (ఎంపీ | బొత్స ఝాన్సీ లక్ష్మి |
3. | ఏలూరు (ఎంపీ) | కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ |
4. | విజయవాడ (ఎంపీ) | కేశినేని నాని |
5. | కర్నూలు (ఎంపీ) | గుమ్మనూరి జయరాజ్ |
6. | తిరుపతి (ఎంపీ) | కోనేటి ఆదిమూలం |
7. | ఇచ్చాపురం | పిరియా విజయ |
8. | టెక్కలి | దువ్వాడ శ్రీనివాస్ |
9. | చింతలపూడి (ఎస్సీ) | కంభం విజయ రాజ్ |
10. | రాయదుర్గం | మెట్టు గోవిందరెడ్డి |
11. | దర్శి | బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి |
12. | పూతలపట్టు (ఎస్సీ | మూతిరేకుల సునీల్ కుమార్ |
13. | చిత్తూరు | విజయానంద రెడ్డి |
14. | మదనపల్లె | నిస్సార్ అహ్మద్ |
15. | రాజంపేట | ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి |
16. | ఆలూరు | బూసినే విరూపాక్షి |
17. | కొడుమూరు ( ఎస్సీ) | డాక్టర్ సతీష్ |
18. | గూడూరు ( ఎస్సీ) | మేరీగ మురళి |
19. | సత్యవేడు ( ఎస్సీ) | మద్దిల గురుమూర్తి |
20. | పెనుమలూరు | జోగి రమేష్ |
21. | పెడన | ఉప్పాల రాము |
ఈ లిస్టులో దీనితోపాటు ప్రస్తుతం ఇచ్చాపురం జడ్పిటిసిగా పనిచేస్తున్న ఉప్పాడ నారాయణమ్మను శ్రీకాకుళం జడ్పీ చైర్మన్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
నాలుగో జాబితాలో…
నెం. | నియోజకవర్గం | అభ్యర్థి |
1. | చిత్తూరు ( ఎంపీ) ( ఎస్సీ) | కే నారాయణస్వామి |
2. | జి.డి. నెల్లూరు ( ఎస్సీ) | ఎన్ రెడ్డప్ప |
3. | శింగనమల ( ఎస్సీ) | ఎం వీరాంజనేయులు |
4. | నందికొట్కూరు ( ఎస్సీ) | డాక్టర్ సుధీర్ దారా |
5. | తిరువూరు( ఎస్సీ) | నల్లగట్ల స్వామి దాస్ |
6. | మడకశిర ( ఎస్సీ) | ఈర లక్కప్ప |
7. | కొవ్వూరు ( ఎస్సీ) | తలారి వెంకట్రావు |
8. | గోపాలపురం ( ఎస్సీ) | తానేటి వనిత |
9. | కనిగిరి | దద్దాల నారాయణ యాదవ్ |
ఐదో జాబితాలో ఏడుగురిని మాత్రమే ప్రకటించింది...
నెం. | నియోజకవర్గం | అభ్యర్థి |
1. | మచిలీపట్నం (ఎంపీ) | సింహాద్రి రమేశ్ బాబు |
2. | నర్సరావుపేట (ఎంపీ) | అనిల్ కుమార్ యాదవ్ |
3 | తిరుపతి (ఎంపీ) | మద్దిల గురుమూర్తి |
4. | కాకినాడ (ఎంపీ) | చలమలశెట్టి సునీల్ |
5. | అరకు | రేగం మత్స్యలింగం |
6. | సత్యవేడు | నూకతోటి రాజేష్ |
7. | అవనిగడ్డ | డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావు |
ఇక ఆరో జాబితా శుక్రవారం విడుదల చేసింది. ఇందులో పది మందిని ఖరారు చేశారు. వసంతకృష్ణప్రసాద్ కు స్తానం దక్కలేదు.
నెం. | నియోజకవర్గం | అభ్యర్థి |
1. | రాజమండ్రి (ఎంపీ) | డాక్టర్ గూడూరి శ్రీనివాస్ |
2. | నర్సాపురం (ఎంపీ) | గూడూరి ఉమాబాల |
3. | గుంటూరు (ఎంపీ ) | ఉమ్మారెడ్డి వెంకట రమణ |
4. | చిత్తూరు (ఎస్సీ) (ఎంపీ) | ఎన్ రెడ్డప్ప |
5. | మైలవరం | సర్నాల తిరుపతిరావు యాదవ్ |
6. | మార్కాపురం | అన్నా రాంబాబు |
7. | గిద్దలూరు | కె. నాగార్జున రెడ్డి |
8. | నెల్లూరు సిటీ | ఎండీ. ఖలీల్ (డిప్యూటీ మేయర్) |
9. | జీడీ నెల్లూరు | కె నారాయణ స్వామి |
10. | ఎమ్మిగనూరు | బుట్టా రేణుక |
మరో రెండు రోజుల్లో ఏడో జాబితా ఉండబోతున్నట్లుగా సమాచారం.