వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారినా ఆంధ్ర ప్రదేశ్ కు ఇంకా వర్షం ముప్పు పొంచివున్నట్లు సమాచారం. రాగల మూడు గంటల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు పలుప్రాంతాల్లో కురిసే అవకాశాలున్నట్లు సమాచారం.
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసి బీభత్సం సృష్టించాయి. తీరందాటిన తర్వాత క్రమక్రమంగా బలహీనపడ్డ వాయుగుండం ప్రస్తుతం అల్పపీడనంగా కొనసాగుతోంది. అయితే ఈ అల్పపీడన ప్రభావంతో ఇవాళ(ఆదివారం) రాగల మూడుగంటల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో heavy rains కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం వుందని అంచనా వేసారు. ముఖ్యంగా guntur city తో పాటు ఒంగోలు, చీరాల, బాపట్ల పట్టణాల్లో వర్షతీవ్రత ఎక్కువగా వుండనున్నట్లు హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలతో పాటు జిల్లా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు.
ఇక ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలు andhra pradesh ను అతలాకుతలం చేసాయి. గతంలో ఎప్పుడూ లేనంత భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో కురిసాయి. దీంతో నదులు, వాగులు వంకలు, చెరువులు కట్టలు తెంచుకుని వరద నీరు జనావాసాలపై విరుచుకుపడ్డాయి. అనేకచోట్ల గ్రామాలకు గ్రామాలే వరదనీటిలో మునిగిపోయి పదులసంఖ్యలో ప్రజలు కొట్టుకుపోయిన విషాద ఘటనలు వెలుగుచూసాయి.
VIDEO వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే (వీడియో)
వరదనీటి ఉదృతికి కడప జిల్లా రాజంపేట సమీపంలోని అన్నమయ్య జలాశయం మట్టికట్ట కొట్టుకుపోయింది. దీంతో పరిసర ప్రాంతాల్లో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగి పలు గ్రామాలను ముంచెత్తింది. ఈ క్రమంలోనే నందలూరు పరివాహక ప్రాంతంలోని మందపల్లి, ఆకేపాడు, నందలూరు ప్రాంతంలో మూడు ఆర్టీసీ బస్సులు వరదనీటిలో చిక్కుకున్నాయి. ఈ ఘటనలో సుమారు 30 మంది చెయ్యేరు వరద ఉధృతిలో కొట్టుకుపోయారు.
ఈ ఘటనలో భారీ ఎత్తున ప్రాణ నష్టం వాటిల్లింది. వరద నీటిలో కొట్టుకుపోయిన వారిలో ఇప్పటివరకు 12 మృతదేహాలను వెలికితీశారు. గండ్లూరులో ఏడు, రాయవరంలో 3, మండపల్లిలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని స్థానికులు చెబుతున్నారు.
ఇక చిత్తూరు జిల్లాలోనూ వర్ష బీభత్సం కొనసాగింది. టెంపుల్ సిటీ తిరుపతితో పాటు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలను కూడా భారీవర్షాలు ముంచెత్తాయి. తిరుపతిలో భారీ వర్షాలతో రోడ్లు చెరువుల్లా మరాయి. మోకాల్లోతు నీరు రోడ్డుపైకి చేరడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇక వరద నీరు ఇళ్లలోకి చేరి లోతట్టుప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
READ MORE ఏపీలో వరద బీభత్సం: బాధితులకు టీడీపీ చేయూత.. సహాయక చర్యల్లో పార్టీ నేతలు, సీనియర్లతో కమిటీలు
ఇక తిరుమలలో పరిస్థితి మరీ అద్వాన్నంగా మారింది. శేషాచలం కొండల్లో కురిసిన భారీ వర్షం కారణంగా వరదనీరు కొండపైనుండి దిగువకు పరవళ్లు తొక్కింది. దీంతో వెంకటేశ్వర స్వామి వెలిసిన ఏడుకొండలపై కూడా వరదనీరు చేరి భక్తులు, ఆలయ సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ఇక కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్లతో పాటు నడకమార్గాల్లో వరదనీటి ఉదృతి ప్రమాదాలకు దారితీసింది. ఘాట్ రోడ్డుపై కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలను నిలిపివేయాల్సి వచ్చింది. అలాగే నడకమార్గంలో వరదనీటి ప్రవాహం ఎక్కువగా వుండటంతో ఆ మార్గాలను కూడా మూసివేసారు. దీంతో కొండపైకి రాకపోకలు నిలిచిపోయారు. అయితే తాజాగా వర్షతీవ్రత తగ్గి పరిస్థితి సాధారణంగా మారడంతో యధావిధిగా అన్ని మార్గాల్లో రాకపోకలు సాగుతున్నాయి.
కపిలేశ్వర స్వామి దేవాలయం వద్ద వరదనీరు ఉప్పొంగుతూ ప్రమాదకర రీతిలో కిందకు దూకుతోంది. అలాగే కొండపైనుండి దిగువకు వరదనీరు జాలువారుతూ జలపాతాన్ని తరపించాయి. ఇక తిరుమల ఘాట్ రోడ్ లో ఓ ద్విచక్రవాహనం అదుపుతప్పి వరదనీటిలో పడటంతో ఆ నీటి ప్రవాహంలో వాహనదారుడు కొట్టుకుపోయాడు. మరికొన్ని వాహనాలు కూడా వరదనీటిలో చిక్కుకున్నాయి.
అయితే వాయుగుండం బలహీనపడటంతో వర్షాలు తగ్గడంతో ఇప్పుడిప్పుడే ఊరటచెందుతున్న ప్రజలకు మళ్లీ భారీవర్షాల హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే నీటిప్రవాహాలు, నదులు, జలాశయాలు, వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నారు. మళ్ళీ వర్షాలు కురిస్తే వరదనీరు చేరి ఎలాంటి ప్రమాదాలకు దారితీస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.
.