చిత్తూరు, నెల్లూరు జిల్లాలను కుదిపేసిన భారీ వర్షం: స్తంభించిన జనజీవనం, రూ.కోట్లలో నష్టం

By Siva KodatiFirst Published Nov 12, 2021, 8:19 PM IST
Highlights

బంగాళాఖాతంలో (bay of bengal) ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కురిసిన (heavy rains) భారీ వర్షాలకు నెల్లూరు (nellore), చిత్తూరు (chittoor) జిల్లాలు అతలాకుతలమయ్యాయి. బుధవారం రాత్రి మొదలైన వర్షం గురువారం అర్ధరాత్రి వరకూ తగ్గలేదు.

బంగాళాఖాతంలో (bay of bengal) ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కురిసిన (heavy rains) భారీ వర్షాలకు నెల్లూరు (nellore), చిత్తూరు (chittoor) జిల్లాలు అతలాకుతలమయ్యాయి. బుధవారం రాత్రి మొదలైన వర్షం గురువారం అర్ధరాత్రి వరకూ తగ్గలేదు. నదులు, కాలువలు, చెరువుల్లోకి వరద నీరు చేరడంతో అవి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. బలమైన ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకూ అంతరాయం కలిగింది. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొండ చరియలు విరిగిపడుతుండటంతో తిరుపతి ఘాట్‌రోడ్లు రెండింటినీ శుక్రవారం ఉదయం వరకు అధికారులు మూసేశారు. రేణిగుంట విమానాశ్రయం (renigunta airport), రుయా (ruya hospital tirupati) ఆసుపత్రి నీటమునిగాయి. 

నెల్లూరు జిల్లాలో రైల్వే సిగ్నల్‌ వ్యవస్థ దెబ్బతినడంతో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో పలు గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. 13 మండలాల్లో 402 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. శ్రీకాళహస్తి, సత్యవేడు, తిరుపతి, నగరి, గంగాధరనెల్లూరు, చంద్రగిరి, పూతలపట్టు నియోజకవర్గాల్లో ఈదురు గాలులతో కూడిన భారీవర్షాలు కురుస్తున్నాయి. అప్రమత్తమైన అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి శిబిరాలు నిర్వహిస్తున్నారు. స్వర్ణముఖి నది (swarnamukhi river) ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. 

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో తిరుపతి (tirupati) నగరంలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. గాలులకు భారీ వృక్షాలు భవనాలపై పడటంతో నష్టం వాటిల్లింది. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో పాటు తీగలు తెగిపోవడంతో పలు ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి, మేయర్‌ శిరీష, కమిషనరు గిరీష సందర్శించి సహాయక చర్యలు పర్యవేక్షించారు. జిల్లాలోని జలాశయాల గేట్లన్నీ దాదాపు ఎత్తేశారు. రామచంద్రాపురం మండలం పీవీపురం వాగులో ఓ మహిళ గల్లంతు కావడంతో గ్రామస్థులు , అధికారులు గాలిస్తున్నారు.

Also Read:తిరుపతిలో వర్షబీభత్సం.. దాదాపు నగరమంతా నీటిలోనే, రాత్రంతా వానపడితే భయానకమే

మరోవైపు తిరుపతి విమానాశ్రయానికి రావాల్సిన ఆరు విమానాలు వర్షం కారణంగా నిలిచిపోయాయి. హైదరాబాద్‌ నుంచి రేణిగుంట రావాల్సిన ఇండిగో విమానం ప్రతికూల వాతావరణం కారణంగా తిరిగి హైదరాబాద్‌ వెళ్లింది. విద్యాసంస్థలన్నింటికీ గురు, శుక్రవారాలు సెలవు ప్రకటించారు. తిరుపతి - చెన్నై రైలుమార్గంలో పుత్తూరు మండలం తడుకు సమీపంలో రైల్వేట్రాక్‌ వరదనీటిలో మునిగిపోవడంతో ఈ ప్రాంతంలో రైళ్లు నెమ్మదిగా నడుస్తున్నాయి. 

తిరుపతి సమీపంలోని చెర్లోపల్లె వద్ద రైల్వే అండర్‌బ్రిడ్జి లోపల ఆర్టీసీ బస్సు చిక్కుకుపోవడంతో... పోలీసులు ప్రయాణికులను బయటకు తీశారు. అటు భారీ వర్షాలు, వరదల కారణంగా ఎస్పీడీసీఎల్‌కు (apspdcl) రూ.3.20 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రకటించారు. చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాల పరిధిలో నష్ట వివరాలను సంస్థ వెల్లడించింది. అధికారులకు, సిబ్బందికి సెలవులను రద్దు చేశారు. జిల్లాలవారీగా కంట్రోల్‌రూమ్‌లను ఏర్పాటుచేస్తూ సంస్థ సీఎండీ హరనాథరావు ఆదేశాలిచ్చారు

click me!