ఏపీ: 24 గంటల్లో 262 మందికి పాజిటివ్.. 20,66,719కి చేరిన సంఖ్య, తూర్పుగోదావరిలో అత్యధికం

Siva Kodati |  
Published : Nov 12, 2021, 07:02 PM IST
ఏపీ: 24 గంటల్లో 262 మందికి పాజిటివ్.. 20,66,719కి చేరిన సంఖ్య, తూర్పుగోదావరిలో అత్యధికం

సారాంశం

ఏపీలో కొత్తగా 262 కరోనా కేసులు (corona cases in ap) నమోదవ్వగా.. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 229 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 3,227 మంది చికిత్స పొందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) గడిచిన 24 గంటల్లో 262 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,66,719కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,411కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల కృష్ణా, శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 229 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,49,081కు చేరింది. గత 24 గంటల వ్యవధిలో 33,362 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,99,17,592కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 3,227 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 18, చిత్తూరు 38, తూర్పుగోదావరి 46, గుంటూరు 33, కడప 6, కృష్ణ 31, కర్నూలు 1, నెల్లూరు 16, ప్రకాశం 6, శ్రీకాకుళం 6, విశాఖపట్నం 28, విజయనగరం 6, పశ్చిమ గోదావరిలలో 27 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

Heavy Rain Alert : తెలుగు ప్రజలారా కాస్కొండి.. ఇక భారీ వర్షాలు షురూ, ఈ జిల్లాలకు అలర్ట్ జారీ
AP Food Commission Chairman: కంప్లైంట్ చూసి తనిఖీకి వచ్చిన ఫుడ్ కమీషన్ చైర్మన్ | Asianet News Telugu