అందుకే రాష్ట్ర విభజన వద్దన్నాం.. కేసీఆర్ దగ్గర మార్కుల కోసమే ఇలా : ప్రశాంత్ రెడ్డికి సజ్జల కౌంటర్

Siva Kodati |  
Published : Nov 12, 2021, 06:34 PM IST
అందుకే రాష్ట్ర విభజన వద్దన్నాం.. కేసీఆర్ దగ్గర మార్కుల కోసమే ఇలా : ప్రశాంత్ రెడ్డికి సజ్జల కౌంటర్

సారాంశం

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రం వద్ద బిచ్చమెత్తుకుంటున్నారంటూ తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. దీనిపై ఇప్పటికే మంత్రి పేర్ని నాని కౌంటరివ్వగా.. తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) సైతం స్పందించారు

ప్రభుత్వాన్ని నడపడం కోసం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రం వద్ద బిచ్చమెత్తుకుంటున్నారంటూ తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. దీనిపై ఇప్పటికే మంత్రి పేర్ని నాని కౌంటరివ్వగా.. తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) సైతం స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారనే నాడు రాష్ట్ర విభజనను వ్యతిరేకించామని ఆయన గుర్తుచేశారు.

ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన సంపద అంతా హైదరాబాద్‌లోనే వుందన్నారు. విభజన నాడే హైదరాబాద్‌లో వాటా కోరామని సజ్జల అన్నారు. అన్యాయంగా విభజించారని.. ఎలాంటి రీసోర్స్ లేదని, ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి లేదని అంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమై వుందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కేసీఆర్ వద్ద మార్కులు కొట్టేసేందుకు కొందరు తెలంగాణ మంత్రులు ఇలా మాట్లాడుతున్నారని సజ్జల వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం నుంచి ఎవరూ ఈ తరహా వ్యాఖ్యలు చేయని ఆయన స్పష్టం చేశారు. 

అంతకుముందు ఏపీలోని (ap govt) జగన్ ప్రభుత్వంపై (ys jagan mohan reddy) తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి (prasanth reddy)  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోళ్లకు (paddy) సంబంధించి టీఆర్ఎస్ (trs) శ్రేణులు రైతు ధర్నాలు  చేస్తున్న సంగతి తెలిసిందే. నిజామాబాద్‌లో శుక్రవారం జరిగిన రైతు ధర్నాలో పాల్గొన్న ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రా సీఎం జగన్ నిధులు లేక కేంద్రాన్ని అడుక్కుతింటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 

Also Read:బయట కాలర్ ఎగరేసి, ఇంట్లోకెళ్లి కాళ్లు పట్టుకోవడం మాకు రాదు: ప్రశాంత్ రెడ్డికి పేర్నినాని కౌంటర్

తెలంగాణ వస్తే అడుక్కుతింటారని ఎద్దేవా చేసిన వారే.. బిచ్చం ఎత్తుకుంటున్నారని ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ నడవాలంటే కేంద్రం నిధులు (central funds) కావాలని.. కేంద్రం ఒత్తిడితో ఏపీలో రైతుల మోటార్లకు మీటర్లు పెట్టారని మంత్రి చెప్పారు. దేశంలోని రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని మోడీ ప్రయత్నిస్తున్నారని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో రైతుల మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని ఆయన తేల్చిచెప్పారు. కేంద్రం రైతులకు చేస్తున్న మోసంపై బీజేపీ నేతలను అడుగడుగునా అడ్డుకోవాలని ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 

తెలంగాణ రైతులు పండించే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఇవాళ(శుక్రవారం) రాష్టవ్యాప్త ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. పంజాబ్ రైతుల నుండి మొత్తం ధాన్యాన్ని ఎలాగయితే కేంద్రం కొనుగోలు చేస్తుందో తెలంగాణ రైతుల నుండి కూడా అలాగే కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం కోరుతోంది. కేంద్రం తెలంగాణ రైతులపై వివక్ష ప్రదర్శిస్తోందని టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : శ్రీలంక సమీపంలో ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు
Minister Narayana: అమరావతికి కొత్త దారి.. పరిశీలించిన మంత్రి నారాయణ | Asianet News Telugu