ఏపీలో సోమ, మంగళవారాల్లో అతి భారీ వర్షాలు... ఆ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక, స్కూళ్లకు సెలవు

By Arun Kumar P  |  First Published Nov 29, 2021, 10:50 AM IST

ఆంధ్ర ప్రదేశ్ కు భారీ వర్షాలు ముప్పు పొంచివుంది. పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించిన వాతావరణ  శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. 


అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ను వర్షాలు వదిలిపెట్టడం లేదు. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మళ్ళీ రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యాయి. ఇవాళ(సోమవారం) రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో heavy to extreme heavy rains కురిసే అవకాశాలున్నాయంటూ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.  

భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో చిత్తూరు, కడప జిల్లాల్లో ఇవాళ స్కూళ్లకు సెలవు ప్రకటించారు.  గుంటూరు, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. floods ముప్పు పొంచివున్న జిల్లాల అధికారులతో ఇప్పటికే cm ys jagan మాట్లాడి తగు సూచనలు చేసారు. 

Latest Videos

undefined

ఇక ఇప్పటికే kadapa district కోడూరు, చిట్వేల్ మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనుంపల్లి వద్ద వాగులు పొంగిపొర్లుతుండటంతో చిట్వేలి, రాపూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జమ్మలమడుగులో ఓ మోస్తరు వర్షం కురిసింది. రాయచోటిలో ఉదయం నంచి భారీ వర్షం కురుస్తోంది. 

read more  Heavy Rains: నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో రాత్రి నుంచి భారీ వర్షాలు.. ఆందోళన చెందుతున్న ప్రజలు..

anantapur district లోని పుట్టపర్తి, తాడిపత్రిలోనూ వర్షతీవ్రత ఎక్కువగా వుంది. ప్రకాశం జిల్లా కంభం, బెస్తవారిపేట, అర్ధవీడులో వర్షాలు కురుస్తున్నాయి. చీరాలలో చిరుజల్లులు కురిసాయి.  నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. పలు గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనంతసాగరం ఎస్సీ కాలనీలోకి వరదనీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 

ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొగింపొర్లుతున్నాయి. నదులు, నీటి ప్రవాహాలు వరదనీటితో ప్రమాదకరంగా మారాయి. జలాశయాలు, చెరువులు నిండుకుండలా మారాయి. కాబట్టి ప్రజలెవ్వరూ నీటి ప్రవాహాలు, జలాశయాలు సమీపానికి వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. 

సోమ, బుధవారాలు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో 7 సెంటిమీటర్ల నుంచి 20 సెంటిమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం వుందని హెచ్చరించింది.

read more  ఎడతెరిపి లేకుండా వర్షం: పెన్నా మహోగ్రరూపం, అనంత జిల్లాలో ఆనకట్టల గేట్ల ఎత్తివేత

ఇక తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం వుందని హెచ్చరించారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు జాగ్రత్తగా వుండాలని... డిసెంబర్ 1 వరకు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. 

మరోవైపు విస్తారంగా కురుస్తున్న వర్షాలతో అనంతపురం జిల్లాలో పెన్నా నది మహోగ్రరూపం దాల్చింది. పెన్నా నదికి ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. దాంతో జిల్లాలో పెన్నా నదిపై ఉన్న అన్ని డ్యాముల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీనిలో భాగంగా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 1000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. 


 

click me!