ఏపీ గవర్నర్ కు మరోసారి అస్వస్థత.. హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలింపు..

By AN TeluguFirst Published Nov 29, 2021, 7:29 AM IST
Highlights

ఈనెల 20, 22 తేదీల్లో  ఆర్ టి పి సి ఆర్ పరీక్షలు నిర్వహించగా  కోవిడ్ నెగిటివ్గా నిర్ధారణ కావడంతో  23న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఆదివారం సాయంత్రం మరోసారి అస్వస్థతకు గురికావడంతో విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకొని ఏఞజీ ఆస్పత్రికి వెళ్లారు. 

అమరావతి :  ఇటీవల  కరోనా బారిన పడి కోలుకున్న  ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్ర గవర్నర్  బిశ్వభూషణ్ హరిచందన్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు.  దీంతో ఆయనను హైదరాబాదులోని  ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.  ఈనెల 15న గవర్నర్కు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా తేలింది. 

దీంతో ఆయన 17న హైదరాబాద్  గచ్చిబౌలిలోని ఆస్పత్రిలో చేరారు. ఈనెల 20, 22 తేదీల్లో  ఆర్ టి పి సి ఆర్ పరీక్షలు నిర్వహించగా  కోవిడ్ నెగిటివ్గా నిర్ధారణ కావడంతో  23న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఆదివారం సాయంత్రం మరోసారి అస్వస్థతకు గురికావడంతో విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకొని ఏఞజీ ఆస్పత్రికి వెళ్లారు. 

కాగా, నవంబర్ 23న గవర్నర్ coronavirus నుండి కోలుకుని విజయవాడ చేరుకున్నారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు, వైద్యుల సేవల ఫలితంగానే కోలుకున్నానని గవర్నర్ అన్నారు. సకాలంలో రెండు డోసుల వాక్సిన్ తీసుకోవటం ఎంతో మేలు చేసిందని గవర్నర్ హరిచందన్  అన్నారు. కోవిడ్ ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నప్పటికీ అశ్రద్ద పనికిరాదని హరిచందన్ ప్రజలకు సూచించారు. 

కరోనా నుండి కోలుకుని విజయవాడ చేరుకున్న ఏపీ గవర్నర్ biswabhusan harichandanకు రాజ్‌భవన్‌లో ఘన స్వాగతం పలికారు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా. కరోనా పాజిటి‌వ్‌‌గా తేలడంతో గవర్నర్ హరిచందన్ నవంబర్ 17వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని AIG hospitalలో చేరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి  ys jagan mohan reddy వైద్యులకు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అటు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న సమయంలో ఉప రాష్ట్రపతి venkaiah naidu, తెలంగాణ గవర్నర్ tamilisai soundararajanలు ఆయనను పరామర్శించారు. 

అయితే.. వైద్య చికిత్సల అనంతరం కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకుని అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. 

తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి ఆకస్మిక మృతి

ఇదిలా ఉండగా, ఈ నెల 15న  ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు corona సోకిందని వైద్యులు తెలిపారు. రెండు రోజులుగా గవర్నర్ జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు అస్వస్థతకు గురయ్యారు. 

దీంతో 17వ తేదీ ఉదయమే ఆయన ప్రత్యేక విమానంలో hyderabad లోని ఆసుపత్రిలో చేరారు.ఏపీ గవర్నర్ ఇటీవలనే ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ నుండి వెళ్లి వచ్చిన నాటి నుండి ఆయన అస్వస్థతతో ఉన్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ ఇటీవల కాలంలో ఎవరిని కలిశారో వారంతా  కరోనా నిర్ధారణ పరీక్షలు  నిర్వహించుకోవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.ఏపీ గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరా తీశారు. ఏపీ గవర్నర్ చికిత్స పొందుతున్న ఆసుపత్రి వైద్యులతో సీఎం జగన్ మాట్లాడారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై జగన్ ఆరా తీశారు.

click me!