రాజమండ్రిలో భారీ వర్షం... నీటమునిగి చెరువులా మారిన ఎమ్మార్వో కార్యాలయం (వీడియో)

By Arun Kumar PFirst Published Sep 6, 2021, 2:29 PM IST
Highlights

రాజమండ్రి పట్టణంలో ఆదివారం సాయంత్రం నుండి కురుస్తున్న భారీ వర్షానికి స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలోకి వర్షపునీరు చేరి చెరువును తలపిస్తోంది. 

రాజమండ్రి: ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం కూడా పలుచోట్ల జోరు వాన కురిసింది. ఇలా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆదివారం సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్లపైకే కాదు ఇళ్లలోకి కూడా నీరు చేరాయి. అంతేకాదు పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయంలోకి కూడా వర్షపు నీరు చేరడంతో సిబ్బంది, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 

వర్షపు నీటిలో మునిగిన రాజమండ్రి అర్బన్ ఎమ్మార్వో కార్యాలయం చిన్నపాటి చెరువును తలపిస్తోంది. నిన్నటి నుంచి ఆగకుండా వర్షం కురుస్తుండటంతో ఆఫీసు అంతా మునిగి పోయి సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

వీడియో


 
నూతన కార్యాలయం కోసం ప్రభుత్వానికి ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. దీంతో ఇలా వర్షపునీటి తోనే తడుస్తూ మునుగుతూ ప్రజలకు సేవలు అందిస్తున్న సిబ్బందిని పట్ల స్ధానికులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం దీన్ని గుర్తించి నూతన కార్యాలయాన్ని నిర్మించాలని స్థానికులే కాదు అధికారులు కూడా కోరుతున్నారు. 

read more  ఇవాళ, రేపు ఏపీలో భారీ నుండి అతిభారీ వర్షాలు...: విశాఖ వాతావరణకేంద్రం హెచ్చరిక

ఇదిలావుంటే రాజమండ్రిలోని కోటగుమ్మం సెంటర్లో 6 అడుగుల త్రాచుపాము అలజడి రేపింది. రోడ్డుపై పామును చూసిన ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురవడం వల్ల పక్కనే వున్న గోదావరి నదిలోంచి పాము బయటకు వచ్చి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు.  

ఇక మరో రెండురోజుల పాటు ఆంధ్ర ప్రదేశ్ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని... కొన్నిచోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హెచ్చరించారు. మరో తెలుగురాష్ట్రం తెలంగాణలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. 

ఇప్పటికే తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని అన్ని జలాకళను సంతరించుకుంటున్నాయి. ఇక నదులు, వాగులు, వంకలు, చెరువులు ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో  భారీ వర్షాలు కురిస్తే జనజీవనానికి మరింత ఆటంకం కలిగే  అవకాశం వుంది. లోతట్టు ప్రాంతాలు, నీటి ప్రవాహాల సమీపంలో జీవించే ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించారు. అధికారులు కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా చూడాలని సూచించారు.

 

click me!