మొదటి పెళ్లి దాచి.. నర్స్ తో డాక్టర్ రెండో వివాహం..!

Published : Sep 06, 2021, 01:03 PM IST
మొదటి పెళ్లి దాచి.. నర్స్ తో డాక్టర్ రెండో వివాహం..!

సారాంశం

వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. బాలకోటేశ్వరరావు తనకు పెళ్లయ్యిందని  విషయాన్ని దాచి పెట్టి ఆమెను వివాహం చేసుకున్నాడు.

అతను ఓ వైద్యుడు. అప్పటికే పెళ్లైంది కూడా. అయితే.. ఈ విషయాన్ని దాచిపెట్టి తన దగ్గర పనిచేస్తున్న నర్స్ తో ప్రేమాయణం మొదలుపెట్టాడు. ఆమెను రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే.. పెళ్లైన కొంత కాలానికి ఆ డాక్టర్ కి ముందే పెళ్లి అయ్యిందనే విషయం ఆమెకు తెలిసింది. దీంతో.. ఆమె అతనిని దూరం పెట్టడం మొదలుపెట్టింది.

దీంతో.. తనను వదిలేస్తున్నాడనే కోపంతో రెండో భార్యపై దాడి చేయించాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 నెల్లూరులోని బాలాజీనగర్  లోని బోడిగాడి తోటకు చెందిన ఓ యువతి ఓ ఆస్పత్రి  సాఫ్ట్ నర్స్ గా పనిచేస్తుంది.  అదే ఆస్పత్రిలో హోమియో డాక్టర్ బాలకోటేశ్వరరావు పనిచేస్తున్నారు. వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. బాలకోటేశ్వరరావు తనకు పెళ్లయ్యిందని  విషయాన్ని దాచి పెట్టి ఆమెను వివాహం చేసుకున్నాడు.

కొంతకాలం తర్వాత వివాహమైందన్న విషయం బయటపడింది. బాధితురాలు నిలదీయగా.. ఇద్దరినీ బాగా చూసుకుంటానంటూ నమ్మించాడు. అయితే.. ఆమె నమ్మకం లేక.. అతనిని దూరం పెట్టడం మొదలుపెట్టింది. దీంతో.. ఆమెపై పగ పెంచుకున్నాడు. పథకం ప్రకారం.. తాను రమ్మంటున్నానంటూ ఆమెను మరో వ్యక్తితో బయటకు తీసుకువెళ్లి.. అక్కడ ఆమెపై దాడి చేశారు. కాగా..బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

Vijay Saireddy New Twist On YS Jagan | Vijaysaireddy Press Meet Today | Asianet News Telugu
ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్న Sai Reddy | Vijay Saireddy Press Meet | Asianet News Telugu