క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. యువకుడి మృతి.. నంద్యాలలో ఘటన

Published : Aug 14, 2023, 06:46 AM IST
క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. యువకుడి మృతి.. నంద్యాలలో ఘటన

సారాంశం

ఏపీలోని నంద్యాల విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతున్న సమయంలో ఓ యువకుడు ఒక్క సారిగా కుప్పకూలిపోయాడు. స్నేహితులు వెంటనే అతడిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే ఆ యువకుడు అప్పటికే గుండెపోటుతో మరణించాడని డాక్టర్లు తెలిపారు.

ఇటీవల కాలంలో గుండెపోటుతో మరణాలు అధికంగా జరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పు, శరీరక శ్రమకు దూరమైన జీవన శైలి, ఊబకాయం వంటివి ఈ గుండెపోటుకు కారణమవుతున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో శారీరకంగా ధృడంగా ఉన్న వ్యక్తులు, రెగ్యులర్ గా వర్కౌట్స్ చేసే వారికి కూడా ఈ గుండెపోటు సంభవించి, ప్రాణాలను హరిస్తోంది.  తాజాగా నంద్యాల జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. 

అమెరికా వెళ్లేది లేదు.. గన్నవరంలోనే తేల్చుకుంటా : కార్యకర్తల సమావేశంలో యార్లగడ్డ సంచలన వ్యాఖ్యలు

క్రికెట్ ఆడుతుండగానే ఓ యువకుడికి గుండెపోటు సంభవించి, ఆకస్మికంగా మరణించాడు. వివరాలు ఇలా ఉన్నాయి. బేతంచెర్ల పట్టణంలోని సంజీవ్ నగర్ కాలనీకి చెందినలో 22 ఏళ్ల మహేంద్ర నివసిస్తున్నా. ఆదివారం సెలవు దినం కావడంతో తన స్నేహితులతో కలిసి మధ్యాహ్నం సమయంలో క్రికెట్ ఆడుతున్నాడు. ఇలా క్రికెట్ ఆడుతున్న సమయంలో ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన అక్కడే కుప్పకూలాడు. 

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్? శరద్ పవార్, అజిత్ పవార్‌ల రహస్య భేటీ

స్నేహితులందరూ పరిగెత్తుకుంటూ వచ్చి మహేంద్రను గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కానీ అతడు అప్పటికే మరణించాడని డాక్టర్లు చెప్పారు. చేతికి అందివచ్చిన కుమారుడు ఇలా ఆకస్మికంగా మరణించడంతో ఆ తల్లిదండ్రులు తీవ్రంగా రోదించారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. 

ఆ దుఃఖం, కోపం అంత తేలికగా పోవు: రాహుల్ గాంధీ

గత నెల 21వ తేదీన విజయనగరం జిల్లాలోనూ ఇలాగే జరిగింది. వాకింగ్ కు వెళ్ళిన ఓ యువకుడు గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యాడు. మొగిలివలస గ్రామానికి చెందిన 28 ఏళ్ల  శ్రీహరి  రెగ్యులర్ గా వాకింగ్ కు వెళ్తుంటాడు. ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఉదయం సమయంలో వాకింగ్ కు వెళ్లాడు. అయితే వాకింగ్ చేస్తుండగా ఒక్కసారిగా గుండెల్లో నొప్పి వచ్చింది. వెంటనే అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు.

గాల్వాన్ ఘర్షణ తర్వాత .. తూర్పు లడఖ్‌కు 68 వేల మంది సైన్యం, ఎయిర్ లిఫ్టింగ్ సత్తా చూపిన ఐఏఎఫ్

అయితే అక్కడే ఉన్న అగ్నిమాపక సిబ్బంది శ్రీహరిని గమనించారు. అనంతరం రాజాం గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూనే పరిస్థితి విషమించి యువకుడు మృతి చెందాడు. శ్రీహరి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవాడు. అనుకోకుండా హఠాత్తుగా ఆయన మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు  కన్నీరుమున్నీరయ్యారు.

PREV
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu