ప్రధాని వద్ద చంద్రబాబు కేసుల ఫైళ్ళా ?

Published : May 29, 2017, 04:18 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
ప్రధాని వద్ద చంద్రబాబు కేసుల ఫైళ్ళా ?

సారాంశం

ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలన్న ఫైల్ నిజంగానే ప్రధాని వద్ద ఉంటే  మరి మహానాడులో మళ్ళీ తీర్మానం ఎందుకు చేసారంటూ ప్రశ్నించారు.

కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డికి  పెద్ద సందేహమే వచ్చింది. మహానాడు సందర్భంగా కేంద్రమంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ, ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనే ఫైల్ ప్రధానమంత్రి టెబుల్ పైనుందని అన్నారు. అదే విషయమై రఘువీరా మాట్లాడుతూ, ప్రధాని టేబుల్ పైన ఉన్న ఫైలేదో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేసారు.

ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనా లేక చంద్రబాబుకు భారతరత్న ఇవ్వాలనా అన్న సందేహాన్ని వ్యక్తం చేసారు. దాంతో పాటే చంద్రబాబుపై ఉన్న సిబిఐ ఫైలా లేక సుజనా చౌదరి బ్యాంకులకు ఎగ్గొట్టిన డబ్బులకు సంబంధించిన ఫైలా అంటూ నిలదీసారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలన్న ఫైల్ నిజంగానే ప్రధాని వద్ద ఉంటే  మరి మహానాడులో మళ్ళీ తీర్మానం ఎందుకు చేసారంటూ ప్రశ్నించారు. రఘువీరా ప్రశ్నలో తప్పేమీలేదు కదా? పార్టీ నేతలను, కార్యకర్తలను సుజనా, చంద్రబాబులు మభ్యపెడుతున్నారంటూ ధ్వజమెత్తారు.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే