అసలు జగన్ రెడ్డి వైఎస్సార్ కే పుట్టారా...: హరిరామ జోగయ్య సంచలన వ్యాఖ్యలు

Published : Jul 04, 2023, 12:27 PM IST
అసలు జగన్ రెడ్డి వైఎస్సార్ కే పుట్టారా...: హరిరామ జోగయ్య సంచలన వ్యాఖ్యలు

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య సంచలన వ్యాఖ్యలు చేసారు. 

అమరావతి :ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య సంచలన వ్యాఖ్యలు చేసారు. వైఎస్ జగన్ ప్రవర్తనతీరు చూస్తుంటే అసలీయన వైఎస్ రాజశేఖర్ రెడ్డికే పుట్టారా అనిపిస్తుందంటూ మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు ఆంధ్రజ్యోతి పేర్కొంది. వైఎస్సార్ ప్రత్యర్థులు, ఇతర పార్టీల నాయకులపై చేసే విమర్శలు చాలా హుందాగా వుండేవని... జగన్ మాటల్లో ఆ హుందాతనమే కనిపించడం లేదని అన్నారు. మాటతీరు, విమర్శలు హుందాగా వుండేలా చూసుకోవాలని సూచిస్తూ హరిరామ జోగయ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాసారు. 

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై సీఎం జగన్ విమర్శలను హరిరామ జోగయ్య తప్పుబట్టారు. చట్టప్రకారం విడాకులు తీసుకున్న తర్వాత మరొకరిని పెళ్లాడేందుకు ఎలాంటి అభ్యంతరం వుండదని... పవన్ కూడా అలాగే పెళ్లిళ్ళు చేసుకున్నారని అన్నారు. మరోసారి పవన్ పెళ్లిళ్ల గురించి చౌకబారు విమర్శలు చేయడం మానుకోవాలని మాజీ ఎంపీ సూచించారు. రాజకీయంగా పవన్ ఎదుర్కోలేకే వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. 

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నా ప్రతిపక్షాలతో చాలా హుందాగా వ్యవహరించేవారని హరిరామ జోగయ్య పేర్కొన్నారు. తండ్రి హుందాతనంలో కనీసం 10శాతం కూడా జగన్ లో కనిపించడం లేదని అన్నారు. సినిమాల్లో విలన్ లా జగన్ ప్రవర్తన వుందని మాజీ ఎంపీ జోగయ్య అన్నారు. 

Read More  పవన్ ఇరిటేషన్ స్టార్, చంద్రబాబు ఇమిటేషన్ స్టార్.. జగన్ కాలి మీద వెంట్రుక కూడా పీకలేరు: మంత్రి రోజా

ఇక పవన్ కల్యాణ్ ను వైసిపి నాయకులు చంద్రబాబు దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టార్ అంటూ విమర్శించడంపైనా జోగయ్య సీరియస్ అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నుండి కోట్లాది రూపాయల ప్యాకేజీ తీసుకున్నది జగనేనని జోగయ్య ఆరోపించారు. కేసీఆర్ డబ్బులతో గెలిచి సీఎం అయిన జగన్ ఏపీ ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టారని హరిరామ జోగయ్య అన్నారు. 

రాజారెడ్డి నుండి జగన్ రెడ్డి వరకు ప్రజలను దోచుకోవడం దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారని మాజీ ఎంపీ ఆరోపించారు. వైఎస్ కుటుంబం అవినీతి చిట్టాను ప్రజలముందుకు తీసుకురమ్మంటారా? అంటూ సీఎం జగన్ కు హరిరామ జోగయ్య లేఖ ద్వారా హెచ్చరించారు. 

పవన్‌కు మద్దతుగా మాజీ ఎంపీ హరిరామ జోగయ్య ఇప్పటికే సీఎం జగన్ కు వరుసగా లేఖలు రాస్తున్నారు. ఇటీవలే జగన్‌పై ఈడీ, సీబీఐ విచారణ చేసి క్విడ్‌ప్రోకో, మనీ ల్యాండరింగ్‌ కేసులు నమోదు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ జోగయ్య ఓ లేఖను సంధించారు. తండ్రి ముఖ్యమంత్రిగా వుండగానే జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డరని... వ్యాపారవేత్తలకు లబ్ది చేకూర్చి వారిద్వారా తానుకూడ లాభపడ్డాడని అన్నారు. 

ఇలా అక్రమ ఆస్తులు సంపాదించిన జగన్ పై సిబిఐ, ఈడి అభియోగాలు మోపాయని... ఈ వ్యవహారంలో నిజానిజాలు తేల్చాలని సిబిఐ కోర్టుకు డైరెక్షన్ ఇవ్వాలని హైకోర్టులో పిల్ దాఖలుచేసానని హరిరామ జోగయ్య తెలిపారు. ఒకవేళ ఆయన దోషిగా తేలితే పరిస్థితి ఏంటి? అని హరిరామ జోగయ్య సంచలన వ్యాఖ్యలు చేసారు. 


 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Motivational Speech: Superman కాదు.. Hanuman గురించి చెప్పండి | Asianet News Telugu
Chandrababu, Mohan Bhagwat Attends Bharatiya Vigyan Sammelan Inaugural Session | Asianet News Telugu