గుంటూరులో ఐటీసీ హోటల్ ప్రారంభించడం సంతోషకరం - ఏపీ సీఎం జగన్

Published : Jan 12, 2022, 04:44 PM IST
గుంటూరులో ఐటీసీ హోటల్ ప్రారంభించడం సంతోషకరం - ఏపీ సీఎం జగన్

సారాంశం

ఐటీసీ సంస్థ గుంటూరులో ఫైవ్ స్టార్ హోటల్ ప్రారంభించడం సంతోషకరమని ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. బుధ‌వారం ఆయ‌న గుంటూరు ఐటీసీ చైర్మ‌న్, ఎండీ సంజీవ్ పూరి తో క‌లిసి ‘వెల్ క‌మ్ హోటల్’ ను ప్రారంభించి మాట్లాడారు. ఐటీసీతో ప్రభుత్వం అనేక రంగాల్లో భాగస్వామ్యం అయ్యిందని తెలిపారు.

ఐటీసీ (ITC)  సంస్థ గుంటూరుకు రావడం, ఇక్కడ హోటల్ (hotel)  ప్రారంభించడం సంతోషకరమని ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (ap cm jagan mohan reddy) అన్నారు. బుధ‌వారం ఆయ‌న గుంటూరు ఐటీసీ చైర్మ‌న్, ఎండీ సంజీవ్ పూరి ( itc chairman and md sanjeev puri) తో క‌లిసి ‘వెల్ క‌మ్ హోటల్’ (wellcome hotel) ను ప్రారంభించారు.  ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడారు. గుంటూరు (guntur) లాంటి పట్టణంలో ఫైవ్‌స్టార్‌ హోటల్ ఉండ‌టం, ఆ హోట‌ల్ లో ఐటీసీ భాగస్వామ్యం కావడం శుభ ప‌రిణామమ‌ని అన్నారు. ఐటీసీ భాగస్వామ్యంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యవసాయరంగంలో ప్రత్యేకంగా పుడ్‌ ప్రాసెసింగ్‌లో ముందుకు వెళ్తోంద‌ని తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని ఏ గ్రామంలోకి వెళ్లి చూసినా విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాల్లో స‌మూల మార్పులు గ‌మ‌నించ‌వ‌చ్చ‌ని తెలిపారు. ప్ర‌తీ గ్రామంలో రైతుభరోసా కేంద్రాలు(ఆర్బీకేలు) ఉన్నాయ‌ని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,700 ఆర్బీకేలు ఉన్నాయ‌ని చెప్పారు. ఇవి రైతుల‌కు ఎంతో స‌హ‌కారంగా ఉంటున్నాయ‌ని తెలిపారు. రైతులు విత్త‌నం నాటిన రోజు నుంచి పంట అమ్ముకునేదాక ఈ ఆర్బీకేలు చేయి ప‌ట్టుకొని న‌డిపిస్తున్నాయ‌ని చెప్పారు. వ్యవసాయ రంగంలో సమూల మార్పులే ఆర్బీకేల ప్రధాన లక్ష్యమ‌ని సీఎం జ‌గ‌న్ అన్నారు. 

గ్రామాల్లోని వ్యవసాయరంగంలో మౌలిక సదుపాయలను ప్రైమరీ ప్రాసెసింగ్ లెవెల్ (primery procesing level) లో క‌ల్పించామ‌ని సీఎం తెలిపారు. త్వ‌ర‌లోనే పార్లమెంట్‌ (perlment) నియోజకవర్గ స్ధాయిలో సెకండరీ ప్రాసెసింగ్‌ లెవల్‌లు ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. ఈ విష‌యంలో ఐటీసీ సంస్థ ముందుకు వ‌చ్చింద‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ఐటీసీ సంస్థ భాగ‌స్వామ్య‌మై కీల‌క‌పాత్ర పోషించ‌నుంద‌ని అన్నారు. గుంటూరులో ఐటీసీ భాగ‌స్వామ్య‌మైన  హోట‌ల్ ఆంధ్రప్రదేశ్‌లో తొలి లీడ్‌ ప్లాటినం సర్టిఫైడ్‌ ఫైవ్‌స్టార్‌ హోటల్‌ (platinum certifide hotel) కావడం గ‌మ‌నార్హ‌మ‌ని అన్నారు.

ప్ర‌భుత్వం ఐటీసీతో మరింత దృఢంగా, పెద్ద ఎత్తున భాగస్వామ్యం అవుతుంద‌ని సీఎం జ‌గ‌న్ అన్నారు. ప్రధానంగా పర్యాటక రంగం, వ్యవసాయ రంగం,  పుడ్‌ ప్రాససింగ్‌ రంగాల్లో ఐటీసీతో భాగస్వామ్యులం అవుతామ‌ని అన్నారు. ఈ భాగ‌స్వామ్యం దీర్ఘ‌కాలం పాటు కొన‌సాగుతుంద‌ని తాము న‌మ్ముతున్నామ‌ని సీఎం జ‌గ‌న్ తెలిపారు. హోటల్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో హోం మినిస్ట‌ర్ మేకతోటి సుచరిత, పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Suddala Ashok Teja CITU India Conference: సుద్దాల కొమరం భీముడో పాటకి సభ మొత్తం పూనకాలే | Asianet
Vidadala Rajini Pressmeet: చంద్రబాబు, పవన్ పై విడదల రజిని సెటైర్లు | Asianet News Telugu