
గురజాల రాజకీయాలు :
గురజాల నియోజకవర్గంలో మొదటిసారి (అసెంబ్లీ ఎన్నికలు 2019) వైసిపి విజేతగా నిలిచింది. అంతకుముందు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలే గురజాల రాజకీయాలను శాసించాయి. కొత్త వెంకటేశ్వర్లు, గడిపూడి మల్లికార్జునరావు, వెంకట నర్సిరెడ్డి, జంగా కృష్ణమూర్తి కాంగ్రెస్, జూలకంటి నాగిరెడ్డి, ముత్యం అంకిరెడ్డి, యరపతినేని శ్రీనివాస్ (మూడుసార్లు) టిడిపి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. 1994, 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో విజేతగా నిలిచిన యరపతినేని 2019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు.
గురజాల నియోజకవర్గంలోని మండలాలు :
గురజాల
దాచేపల్లి
పిడుగురాళ్ల
మాచవరం
గురజాల అసెంబ్లీ ఓటర్లు (2019 ఎన్నికల వివరాల ప్రకారం) :
గురజాలలోని మొత్తం ఓటర్లు - 2,68,598
పురుషులు - 1,31,719
మహిళలు - 1,36,825
గురజాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :
గురజాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019 :
పోలైన ఓట్లు - 2,25,114 (83 శాతం)
వైసిపి - కాసు మహేష్ రెడ్డి -1,17,204 (52 శాతం) - 28,613 ఓట్ల మెజారిటీతో విజయం
టిడిపి - యరపతినేని శ్రీనివాసరావు - 88,591 (39 శాతం) - ఓటమి
జనసేన - చింతలపూడి శ్రీనివాసరావు - 12,503 (5 శాతం)
గురజాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2014 :
నియోజకవర్గంలొ మొత్తం 2,38,623 ఓట్లు వుంటే 1,94,112 ఓట్లు పోలయ్యాయి.
టిడిపి - యరపతినేని శ్రీనివాసరావు - 94,827 (48 శాతం) - 7,187 ఓట్ల మెజారిటీతో విజయం
వైసిపి - జంగా కృష్ణమూర్తి - 87,640 (45 శాతం) - ఓటమి
గురజాల అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
వైసిపి అభ్యర్థి :
గురజాల వైసిపి అభ్యర్థిగా మరోసారి కాసు మహేష్ రెడ్డి బరిలోకి దిగనున్నారు. అయితే ఆయనకు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి నుండి గట్టి పోటీ ఎదురవుతోంది. ఆయనకు టికెట్ ఇవ్వకుంటే పార్టీ మారతారని... టిడిపి నుండి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
టిడిపి అభ్యర్థి :
గురజాల అసెంబ్లీ నుడి మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రతినిధ్యం వహించిన యరపతినేని శ్రీనివాసరావుకే మరోసారి అవకాశం టిడిపి బరిలోకి దింపేలా కనిపిస్తోంది. అయితే వైసిపి నుండి టిడిపిలో చేరడానికి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగతోంది. ఇదే నిజమైతే యరపతినేనికి టిడిపి టికెట్ అంత ఈజీ కాదు. ఎవరు పోటీచేసినా గురజాల అసెంబ్లీ పోరు హోరాహోరీగా వుండనుంది.