బెంగ‌ళూర్ సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ గా గుంటూరు వాసి సీహెచ్‌ ప్రతాప్‌రెడ్డి నియామకం..

By team teluguFirst Published May 17, 2022, 10:41 AM IST
Highlights

తెలుగు వ్యక్తి, ఐపీఎస్ ఆఫీసర్ అయిన ప్రతాప్ రెడ్డి బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ గా నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన 1991 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్. ఆయన చేసిన సేవలకు గతంలో పలు పురస్కారాలు అందుకున్నారు. 

ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన ఐపీఎస్ ఆఫీస‌ర్ సీహెచ్ ప్రతాప్ రెడ్డి మ‌న ప‌క్క రాష్ట్రమైన క‌ర్నాట‌క రాజ‌ధాని బెంగళూరు సిటీకి పోలీసు క‌మిష‌న‌ర్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌బోతున్నారు. ఈ మేర‌కు ఆ స్టేట్ గ‌వ‌ర్న‌మెంట్ సోమ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అందులో బెంగ‌ళూరు సిటీకి కొత్త పోలీసు క‌మిష‌న‌ర్ గా ప్ర‌తాప్ రెడ్డి పేరును పేర్కొంది. 

జూబ్లీహిల్స్ లో మసాజ్ మాటున వ్యభిచారం... రెడ్ హ్యాండెడ్ పట్టుబడ్డ 9మంది అమ్మాయిలు, ఇద్దరు విటులు

ప్ర‌తాప్ రెడ్డి 1991 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీస‌ర్. ఆయ‌న స్వ‌స్థ‌లంలో ఏపీలోని గుంటూరు జిల్లా. గ‌తంలో కూడా ఆయ‌న అదే బెంగ‌ళూరు సిటీకి అడిష‌న‌ల్ క‌మిష‌ర్ గా విధులు నిర్వ‌హించారు.  ప్రస్తుతం కర్ణాటక స్టేట్ లా అండ్ ఆర్ఢ‌ర్ అడిష‌న‌ల్ డీజీపీగా కొన‌సాగుతున్నారు. 

అమిత్ షాకు సీల్డ్ క‌వ‌ర్ అంద‌జేసిన గ‌ద్ద‌ర్.. అందులో ఏముందంటే ?

ప్ర‌తాప్ రెడ్డి బీటెక్ పూర్తి చేశారు. అనంత‌రం సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌లో మంచి ప్ర‌తిభ క‌న‌బ‌రిచి ఐపీఎస్ కు సెలెక్ట్ అయ్యారు. ట్రైనింగ్ పూర్త‌యిన త‌రువాత మొద‌టి సారిగా హాసన్‌ జిల్లా అరసికెరె ఏఎస్పీగా నియ‌మితుల‌య్యారు. అనంత‌రం ప‌లు జిల్లాలో పోలీసు సూప‌రింటెండెంట్ గా విధులు నిర్వ‌హించారు. త‌రువాత క‌ర్నాట‌క‌లోని బెంగ‌ళూరులో, అలాగే ముంబాయి సీబీఐ విభాగంలో కూడా ప‌ని ఏశారు. సైబర్ సెక్యూరిటీ డిపార్టెమెంట్ లో ముఖ్య పాత్ర పోషించారు. సైబ‌ర్ నేరాల‌ను అదుపు చేసేందుకు ఆయ‌న తీవ్రంగా కృషి చేశారు. ఆయ‌న చేసిన సేవ‌ల‌కు గ‌తంలో ప్రెసిడెంట్, సీఎం మెడ‌ల్స్ ను అందుకున్నారు. నేడు ఆయ‌న బెంగ‌ళూరు పోలీసు క‌మిష‌న‌ర్ గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు.  

click me!