ఏపీలో టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీ: కోర్టుకు రావాలని మాజీ మంత్రి నారాయణకు జడ్జి ఆదేశం, నేడు విచారణ

By narsimha lodeFirst Published May 17, 2022, 10:19 AM IST
Highlights


టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ఏపీ మాజీ మంత్రి పి. నారాయణను కోర్టులో హాజరు పర్చాలని కోర్టు ఆదేశించింది. మంత్రి నారాయణతో పాటు జామీనుదారులను కోర్టులో హాజరు పర్చాలని కోర్టు ఆదేశాలపై నారాయణ న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై  ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది. 

తిరుపతి: Tenth  క్లాస్  తెలుగు ప్రశ్నా పత్రం లీకేజీ కేసులో మాజీ మంత్రి Ponguru Narayanaను  కోర్టులో హాజరు పర్చి ఆయన ఎదుటే  జామీను దారులను చూపాలని Judge ఆదేశించారు.

Andhra Pradesh లో పదవ తరగతికి చెందిన Telugu Question లీకేజీ కేసులో మాజీ మంత్రి పి. నారాయణను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరెస్టైన నారాయణకు కోర్టు ఈ నెల 11న Bail  మంజూరు చేసింది. లక్ష రూపాయాల చొప్పున  ఇద్దరు పూచీకత్తులను కోర్టుకు సమర్పించాలని జడ్జి సులోచనారాణి ఆదేశించారు. ఈ నెల 18 లోపుగా పూచీకత్తులను కోర్టుకు సమర్పించాలని కూడా ఆదేశించింది.

 దీంతో  సోమవారం నాడు మాజీ మంత్రి నారాయణ న్యాయవాదులు చంద్రశేఖరనాయుడు, రామకృష్ణ, జ్యోతిరామ్ లను నాలుగో అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పర్చారు.  అయితే మాజీ మంత్రి నారాయణను కూడా కోర్టులో హాజరుపర్చాలని కూడా న్యాయమూర్తి ఆదేశించారు.అయితే ఈ విషయమై నారాయణ తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. దీంతో కేసు విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది కోర్టు.  

also read:నారాయణ బెయిల్ రద్దుకై చిత్తూరు పోలీసుల పిటిషన్: మాజీ మంత్రికి కోర్టు నోటీసులు

చిత్తూరు జిల్లాలోని తిరుపతి నారాయణ విద్యా సంస్థల నుండి తెలుగు ప్రశ్నాపత్రం లీకేజీపై నమోదైన కేసులో నారాయణను అరెస్ట్ చేశారు. ఈ విషయమై ఈ ఏడాది ఏప్రిల్ 27న చిత్తూరు డీఈఓ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చారు. మాజీ మంత్రి నారాయణకు ఈ నెల 11వ తేదీ తెల్లవారుజామున చిత్తూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

2014లోనే నారాయణ విద్యా సంస్థల  చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు ఆయన తరఫున న్యాయవాదులు న్యాయమూర్తికి ఆధారాలు చూపించారు. దీంతో ఆ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. ఈ సందర్భంగా రూ. లక్ష చొప్పున ఇద్దరు జామీను ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు.

మాజీ మంత్రి  నారాయణ విద్యాసంస్థల అధినేతగా ఉన్నారని పోలీసులు అభియోగం మోపారు. కానీ, 2014లోనే ఆ విద్యాసంస్థల అధినేతగా ఆయన వైదొలిగినట్లు నారాయణ తరపున న్యాయవాది కోర్టులో వాదించారు. నారాయణ విద్యాసంస్థలతో తనకు సంబంధం లేదని, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు న్యాయమూర్తికి సమర్పించారు.

 నేరారోపణ నమ్మే విధంగా లేదని జడ్జి  అభిప్రాయానికి వచ్చినట్లు చెప్పారు. ఘటన జరిగిననాటికి నారాయణ ఆ విద్యాసంస్థల అధినేత కాదని జడ్జి అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. ఈ నెల 18లోగా రూ. లక్ష చొప్పున ఇద్దరి పూచీకత్తు ఇవ్వాలని  న్యాయమూర్తి  ఆదేశించిన విషయం తెలిసిందే.అయితే నారాయణ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 13న చిత్తూరు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నారాయణ విద్యా సంస్థలతో  మాజీ మంత్రి పి. నారాయణకు  సంబంధాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయమై ఆధారాలు కూడా ఉన్నాయని పోలీసులు ప్రకటించారు. నారాయణకు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. నారాయణకు నోటీసులు జారీ చేసింది కోర్టు.


 

click me!