విశాఖ ఏయూ క్వార్టర్ వద్ద రాజశేఖర్ అనే వ్యక్తి దారుణ హత్య

Published : May 17, 2022, 09:25 AM ISTUpdated : May 17, 2022, 09:38 AM IST
 విశాఖ ఏయూ క్వార్టర్ వద్ద రాజశేఖర్ అనే  వ్యక్తి దారుణ హత్య

సారాంశం

విశాఖపట్టణంలోని ఆంధ్రా యూనివర్శిటీ క్వార్టర్స్ వద్ద మంగళవారం నాడు ఓ వ్యక్తి  మృతదేహన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే  మృతుడిని రాజశేఖర్ గా గుర్తించారు.

విశాఖపట్టణం: Visakhapatnam ఆంధ్రా యూనివర్శిటీ కార్వర్టర్ వద్ద  Rajasekhar  అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. విశాఖపట్టణంలోని రైల్వే న్యూ కాలనీలో రాజశేఖర్ నివాసం ఉంటున్నాడని పోలీసులు గుర్తించారు.Finace  కలెక్షన్ ఏజంట్ గా రాజశేఖర్ పనిచేస్తున్నాడు. రాజశేఖర్ ను ఎవరు హత్య చేశారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో హత్య కేసులు ఎక్కువగా నమోదౌతున్నాయి. పట్ట పగలే నడిరోడ్డుపై హత్యలు చేస్తున్న ఉదంతాలు కూడా లేకపోలేదు. హత్యలు చేస్తున్న వారిని నిలువరించే ప్రయత్నాలు చేయకపోగా హత్యలు జరుగుతున్న తీరును సెల్ పోన్లలో రికార్డు చేసేందుకు మొగ్గు చూపడంపై  పోలీసులు అధికారులు కూడా అసహానం వ్యక్తం చేస్తున్న ఘటనలు కూడా చోటు చేసుకొన్నాయి.

ఈ నెల 12న నిర్మల్‌లో పట్టపగలు యువకుడి దారుణ హత్య  కలకలం రేపింది. ఫైల్ బజార్ ఏరియాలో జుబేర్ ఖాన్ అనే యువకుడిని గొంతు కోసి హత్య చేశాడు మరో యువకుడు. కత్తెరతో గొంతు కోసి కిరాతకంగా చంపేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కేసు  నమోదు చేసుకున్న పోలీసులు జుబేర్ ఖాన్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

ఈ ఘటనకు రెండు రోజుల ముందు కూడా నిర్మల్ జిల్లాలో కత్తిపోట్ల  ఘటన కలకలం రేపింది. ఓ యువకుడిని కత్తితో పొడిచి పరారయ్యారు కొంతమంది వ్యక్తులు. డాక్టర్స్ లేన్‌లోని ఓ ల్యాబ్‌లో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. దాడి చేసింది ఎవరో.. ఎందుకు చేశారు.. తదితర కారణాలను పోలీసులు అన్వేషించే పనిలో వున్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలం వానవోలులో ఈ నెల 11న  దారుణం చోటు చేసుకొంది. తల్లిని రాళ్లతొ కొట్టి చంపాడు కొడుకు. తల్లికి వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో పవన్  ఈశ్వరమ్మను కొట్టి చంపాడు. తల్లి చనిపోయిన తర్వాత పవన్ పోలీసులకు లొంగిపోయాడు.

also read:కొడుకు, ప్రియుడితో కలిసి.. రెండో భర్తను దారుణంగా చంపిన భార్య.. ఢిల్లీలో ఘాతుకం...

ఆస్తి కోసం మైనర్ కూతురు తన తండ్రిని ప్రియుడి సహాయంతో దారుణంగా హత్య చేసింది.  ఈ ఘటన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ 29న జరిగింది. మహబూబాబాద్ జిల్లాకేంద్రానికి సమీపంలోని వేమునూరు గ్రామానికి వెంకన్న కు ఓ కూతురు  ఉంది. ఆమె పేరు ప్రభావతి. ఆమె వయస్సు 17 ఏళ్లు. ఆస్తి విషయంలో తండ్రీ  కూతుళ్ల మధ్య విబేధాలు ఏర్పడ్డాయి.  చివరకు కన్నతండ్రిపై ప్రేమ అటుంచి కనీసం జాలికూడా లేకుండా అతి కిరాతకంగా హతమార్చింది కసాయి కూతురు. 

స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రభావతిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వెంకన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆస్తి కోసమే కూతురు తండ్రిని చంపిందా లేక మరేదయినా కారణముందా అన్నది తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు.  ఆస్తుల కోసం కనిపెంచిన వారినే చంపుతున్న ఘటనలు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని నిరూపిస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : దేశవ్యాప్తంగా వర్షాలు, ఈ తెలుగు జిల్లాల్లోనూ.. ఎల్లో అలర్ట్ జారీ
Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu