అన్నమయ్య జిల్లాలో విషాదం: శోభనం గదిలోనే వరుడు మృతి

Published : Sep 14, 2022, 10:50 AM IST
అన్నమయ్య జిల్లాలో విషాదం: శోభనం గదిలోనే వరుడు మృతి

సారాంశం

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో పెళ్లైన 12 గంటలకు వరుడు మృతి చెందాడు. శోభనం గదిలోనే అతను మృత్యువాత పడ్డాడు. వరుడు తులసీ ప్రసాద్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

మదనపల్లి: అన్నమయ్య జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లైన 12 గంటలకే వరుడు మరణించాడు. శోభనం గదిలోనే వరుడు మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

అన్నమయ్య జిల్లాలోని పాకాల మండలానికి చెందిన తులసీప్రసాద్ కు మదనపల్లికి చెందిన యువతితో సోమవారం నాడు వివాహం అయింది.  వివాహం జరిగిన తర్వాత కొత్త జంటకు శోభనం ఏర్పాటు చేశారు. అయితే శోభనం గదిలోనే తులసీ ప్రసాద్ మరణించాడు. వరుడు తులసీప్రసాద్ మరణానికి సంబంధించి కారణాలు తెలియరాలేదు.ఈ విషయమై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహన్ని వరుడి కుటుంబ సభ్యులు తమ స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయనున్నారు. పెళ్లైన గంటల వ్యవధిలోనే వరుడు మృతి చెందడం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nimmala Ramanaidu Comments: అబద్దాలకు ప్యాంటుచొక్కా వేస్తే అదిజగన్మోహన్రె డ్డి | Asianet News Telugu
Sankranti Holidays : స్కూళ్లకి సరే.. ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఎన్నిరోజులు..?