కదులుతున్న రైలులో గర్భిణికి పురిటినొప్పులు.. కాన్పు చేసి కాపాడిన వైద్యవిద్యార్థిని.. ఎక్కడంటే...

Published : Sep 14, 2022, 06:44 AM ISTUpdated : Sep 14, 2022, 10:49 AM IST
కదులుతున్న రైలులో గర్భిణికి పురిటినొప్పులు.. కాన్పు చేసి కాపాడిన వైద్యవిద్యార్థిని.. ఎక్కడంటే...

సారాంశం

దురంతో ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో ప్రయాణిస్తున్న ఓ గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో అదే ట్రైన్ లో ప్రయాణిస్తున్న ఓ వైద్యవిద్యార్థిని ఆమెకు పురుడు పోసింది. 

అనకాపల్లి : తెలతెలవారుతుంది.. చల్లని గాలులతో వాతావరణ హాయిగా ఉంది.. ప్రయాణికులతో నిండుకుండలా దురంతో ఎక్స్ప్రెస్ రైలు దూసుకుపోతోంది. అంతలోనే చిన్న కలకలం… రైలులో ప్రయాణిస్తున్న సత్యవతి అనే ఓ గర్భిణికి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమె భర్త సత్యనారాయణకి ఏం చేయాలో అర్థం కాలేదు. సాయం చేయాలని కనిపించిన వారినల్లా అడిగారు. అదే బోగీలోప్రయాణిస్తున్న విశాఖపట్నం గీతం వైద్య కళాశాల విద్యార్థిని స్వాతిరెడ్డి దీనికి వెంటనే స్పందించింది. సత్యవతిని పరీక్షించింది.  

తోటి మహిళల సహాయంతో పురుడు పోసింది. ఆడబిడ్డను ఈ లోకానికి ఆహ్వానించింది. సోమవారం రాత్రి సికింద్రాబాద్ నుంచి విశాఖ బయల్దేరిన దురంతో ఎక్స్ప్రెస్ లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. సత్యవతి, సత్యనారాయణలది విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పొన్నం గ్రామం. స్వగ్రామానికి వెళ్తుండగా మంగళవారం తెల్లవారుజామున రాజమహేంద్రవరం దాటగానే కాన్పు అయింది. దురంతో ఎక్స్ప్రెస్కు విశాఖ వెళ్ళేదాకా ఎక్కడా హాల్ట్ లేదు. 

సత్యవతి పరిస్థితి గురించి టీటీఈ అందించిన సమాచారం మేరకు అనకాపల్లిలో స్టేషన్ మాస్టర్ వెంకటేశ్వరరావు రైలు ఆపించారు. 108 అంబులెన్స్లో స్థానిక ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు.  గైనకాలజిస్ట్ అనురాధ తల్లీబిడ్డలకు వైద్య పరీక్షలు చేశారు. బిడ్డకు వైద్య సహాయం అందేవరకు స్వాతిరెడ్డి వారి వెన్నంటే ఉన్నారు.   ఆమెకు సత్యవతి, కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. 

జడ్జిలపై సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్‌లు... సీబీఐకి చిక్కిన హిందూపురం వైసీపీ కౌన్సిలర్

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే ఈ జూన్ లో ఆదిలాబాద్ లో చోటు చేసుకుంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆ ఆదివాసీ మహిళకు ఆర్టీసీ బస్సే ఆసుపత్రిగా మారింది. బస్సు డ్రైవరే డాక్టర్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే… మహారాష్ట్రలోని కిన్వట్ తాలూకా సింగరి వాడకి చెందిన గర్భిణీ మడావి రత్నమాల ఇంద్రవెల్లి నుంచి అదిలాబాద్ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరింది. గుడిహత్నూర్ మండలం మనకాపూర్ వద్దకు రాగానే పురుటి నొప్పులు రావడంతో విషయం తెలిసి డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు. ఆర్టీసీ బస్సులోనే ఆదివాసి మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది.

బస్సును ఆపేసిన తరువాత.. 108కి ఫోన్ చేసినా.. వాహనం సకాలంలో రాకపోవడంతో వెంటనే డ్రైవర్ బస్సును నేరుగా గుడిహత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి తల్లీబిడ్డలను అక్కడ చేర్పించాడు. పరీక్షించిన అక్కడి ఆరోగ్య సిబ్బంది తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు చెప్పడంతో.. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ తో పాటు ప్రయాణికులు అందరూ సంతోషించారు.  సమాచారం తెలుసుకున్న ఆర్టీసీ డీవీఎం మధుసూదన్, డీఎం విజయ్  ఆసుపత్రికి చేరుకుని తల్లి బిడ్డ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటన మేరకు పుట్టిన బాబు జీవిత కాలం ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే విధంగా ఉచిత బస్ పాస్ అందిస్తామని తెలిపారు.

డ్రైవర్, కండక్టర్ లకు అభినందనలు…
తల్లీబిడ్డలు సురక్షితంగా ఆస్పత్రికి తరలించిన బస్సు డ్రైవర్ కండక్టర్ సిహెచ్ గబ్బర్సింగ్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి,  సీఎండీ సజ్జనార్ అభినందించారు.  ఆ బిడ్డకు భగవంతుడు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ల ఆయుష్షు ప్రసాదించాలని కోరుకున్నారు.

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu Comments: అబద్దాలకు ప్యాంటుచొక్కా వేస్తే అదిజగన్మోహన్రె డ్డి | Asianet News Telugu
Sankranti Holidays : స్కూళ్లకి సరే.. ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఎన్నిరోజులు..?