చంద్రబాబుకు మనవడు దేవాన్షు వెరైటీ బర్త్ డే విషెస్

Published : Apr 20, 2020, 11:59 AM IST
చంద్రబాబుకు మనవడు దేవాన్షు వెరైటీ బర్త్ డే విషెస్

సారాంశం

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మనవడు దేవాన్షు వెరైటీగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. తన తల్లి నారా బ్రాహ్మణి ట్విట్టర్ ఖాతా నుంచి అతను తాతకు శుభాకాంక్షలు తెలిపాడు.

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆయన మనవడు దేవాన్షు వెరైటీగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తీరు పలువురిని ఆకర్షిస్తోంది.

తన తల్లి నారా బ్రాహ్మణి ట్విట్టర్ ఖాతా నుంచి తన మాటలుగా దేవాన్షు తన తాత చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే ప్రియమైన తాతయ్యకు జన్మదిన శుభాకాంక్షలు అని దేవాన్షు చెప్పాడు. 

"తాతా! మీ ప్రేమను పొందడం గొప్ప విషయం. మీరు నాకు ఓ ఐకాన్, స్ఫూర్తి.. అన్నిటికన్నా మించి మీరు నా బెస్ట్ ఫ్రెండ్" అని దేవాన్షు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పై నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు.  

 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం
అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu