చంద్రబాబుకి చిరు బర్త్ డే విష్.. పొగడ్తలతో ముంచెత్తుతూ..

Published : Apr 20, 2020, 11:32 AM IST
చంద్రబాబుకి చిరు బర్త్ డే విష్.. పొగడ్తలతో ముంచెత్తుతూ..

సారాంశం

కేంద్ర మాజీ మంత్రి, మెగా స్టార్  చిరంజీవి కూడా ఉన్నారు. చంద్రబాబు పై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా.. చిరు చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సాధారణంగా అయితే.. ఆయన పుట్టిన రోజుని టీడీపీ నేతలు పండగలా చేసుకుంటారు. కానీ ప్రస్తుతం లాక్ డౌన్ కదా.. అందుకే ఎలాంటి సంబరాలు లేకుండా.. సోషల్ మీడియాలో విషెస్ తెలియజేస్తున్నారు.

కాగా... ఇలా శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో కేంద్ర మాజీ మంత్రి, మెగా స్టార్  చిరంజీవి కూడా ఉన్నారు. చంద్రబాబు పై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా.. చిరు చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

'దశాబ్దాలుగా అహర్నిశం ప్రజా సేవలో కొనసాగుతున్న మీ సంకల్పబలం అనితరసాధ్యం. కలకాలం మీకు సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించమని ఆ భగవంతుడిని కోరుతున్నాను. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సర్. మీ దూరదృష్టి, కష్టపడే మనస్తత్వం, అంకితభావం అత్యున్నతమైనవి' అని చిరంజీవి ట్వీట్ చేశారు. దీంతో పాటు గతంలో చంద్రబాబుతో ఓ వేడుక సందర్భంగా సరదాగా గడిపిన ఒక ఫోటోను షేర్ చేశారు.

 

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?