ఎంత ప్రజాధనం వృధా అవుతోందో?

Published : Aug 05, 2017, 11:03 AM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
ఎంత ప్రజాధనం వృధా అవుతోందో?

సారాంశం

ముద్రగడ పాదయాత్ర చేస్తాననగానే పోలీసులు అడ్డుకుని ఇంట్లోకి నెట్టేసారు. ఇలా జరగటం ఎన్నోసారో. ముద్రగడ పాదయాత్ర అనటం ప్రబభుత్వం వెంటనే వేలాదిమంది పోలీసులను ఇతర విదుల నుండి కిర్లంపూడి తరదితర ప్రాంతాలకు తరలించేయటం. చాలా రోజులుగా ఇదే జరుగుతోంది తూర్పుగోదావరి జిల్లాలో.

వ్యక్తిగత ప్రతిష్టకు పోయి ప్రభుత్వం ఎంత ప్రజాధనాన్ని వృధా చేస్తోందో? చిన్న విషయాన్ని బూతద్దంలో చూడటం ద్వారా వేలాదిమంది పోలీసులను సేవలను ఎందుకు కొరగాకుండా చేసేస్తోంది. ఇంతకీ విషయమేమిటంటారా? అదే నండి ముద్రగగడ పద్మనాభం గురించే చెప్పేది. శనివారం ముద్రగడ పాదయాత్ర చేస్తాననగానే పోలీసులు అడ్డుకుని ఇంట్లోకి నెట్టేసారు. ఇలా జరగటం ఎన్నోసారో. ముద్రగడ పాదయాత్ర అనటం ప్రబభుత్వం వెంటనే వేలాదిమంది పోలీసులను ఇతర విదుల నుండి కిర్లంపూడి తరదితర ప్రాంతాలకు తరలించేయటం. చాలా రోజులుగా ఇదే జరుగుతోంది తూర్పుగోదావరి జిల్లాలో.

ముద్రగడ విషయంలో ప్రభుత్వం మొదటి నుండి బాగా అతిచేస్తున్నట్లే కనబడుతోంది. మొదట్లో తుని సభకు సరైన భద్రతను కల్పించకుండా అప్పట్లో రైలు దహనానికి అవకాశం కల్పించిది ప్రభుత్వమే. తర్వాత భద్రతా నిబంధనల పేరుతో ముద్రగడను ఇంటినుండి కదలనీయకుండా, కిర్లంపూడిలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్, పోలీసు 30 యాక్ట్ లాంటి చట్టాలను ప్రయోగిస్తూ ఇపుడు అతిచేస్తున్నదీ ప్రభుత్వమే.

ముద్రగడదేముంది పాదయాత్ర అని సైకిల్ ర్యాలీ అని ఏదో ఒకటి చెబుతారు. అందుకు ప్రభుత్వం సరైన భద్రత కల్పించి ముద్రగడను నిరసన చేయనిస్తే ఒకసారికి సరిపోతుంది. కానీ ముద్రగడ ఆందోళనను ప్రతీసారి అడ్డుకుంటోందంటే ప్రభుత్వం ముద్రగడను చూసి భయపడుతోందనే అనుమానించాల్సి వస్తోంది. ముద్రగడ అంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందో అర్ధం కావటం లేదు.

ముద్రగడ ఆందోళనను ప్రభుత్వం రాజకీయ కారణాలతోనే అడ్డుకుంటోందన్నది వాస్తవం. అందుకే ప్రభుత్వానికి, కాపులకు మధ్య  బాగా గ్యాప్ వచ్చేసింది. సరే, ఎవరి రాజకీయ కారణాలెలావున్నా మధ్యలో నలిగిపోతున్నది మాత్రం మామూలు జనాలు, పోలీసులే. రోజుల తరబడి ఇతరత్రా విధులను, కుటుంబాలను వదిలేసి కేవలం ముద్రగడ చుట్టూనే ఉండాల్సి వస్తోంది. దాంతో పోలీసులకు విసుగ్గావుంటోంది. ఇలా ఇంకెతంకాలం జరుగుతుందో ఏమో?

 

 

PREV
click me!

Recommended Stories

Chandrababu NaiduL: క్వాంటం టెక్నాలజీపై చంద్రబాబు అదిరిపోయే స్పీచ్ | Asianet News Telugu
CM Chandrababu Naidu: టెక్ విద్యార్థులతో చంద్రబాబు ‘క్వాంటమ్ టాక్’ | Asianet News Telugu