ఏకంగా గవర్నమెంట్ స్కూలే కబ్జా, ఇల్లు లాగా మార్చి కొత్త హంగులు... వివాదంలో వైసీపీ నేత

Siva Kodati |  
Published : Sep 10, 2022, 05:19 PM ISTUpdated : Sep 10, 2022, 05:21 PM IST
ఏకంగా గవర్నమెంట్ స్కూలే కబ్జా, ఇల్లు లాగా మార్చి కొత్త హంగులు... వివాదంలో వైసీపీ నేత

సారాంశం

నంద్యాల జిల్లా పాణ్యానికి చెందిన వైసీపీ నేత ఒకరు ఏకంగా ప్రభుత్వ పాఠశాలను ఆక్రమించుకున్న వ్యవహారం కలకలం రేపుతోంది. అంతేకాదు... అందులో తాను నివసించేందుకు అనుకూలంగా బిల్డింగ్‌లో అవసరమైన మార్పు చేర్పులు చేయించారు.

నంద్యాల జిల్లా పాణ్యానికి చెందిన వైసీపీ నేత ఒకరు వివాదంలో చిక్కుకున్నారు. స్థానిక ఇందిరా నగర్‌లోని చెంచు గిరిజన విద్యార్ధుల కోసం ప్రభుత్వం 2013లో రూ.5.30 లక్షలతో ప్రభుత్వం పాఠశాలను నిర్మించింది. అయితే విద్యార్ధుల హాజరు లేకపోవడంతో దానిని మూసివేయడమే కాకుండా .. పిల్లలను మరో స్కూల్‌కి తరలించారు. ఈ క్రమంలో.. ఈ స్కూల్‌ను స్థానికంగా వున్న వైసీపీ నేత ఒకరు ఆక్రమించుకున్నారు. అంతేకాదు... అందులో తాను నివసించేందుకు అనుకూలంగా బిల్డింగ్‌లో అవసరమైన మార్పు చేర్పులు చేయించారు. దీనిని పసిగట్టిన స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించి ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. 
 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే