గుంటూరు జిల్లాలో మద్యం బాటిల్‌లో పాము పిల్ల.. షాప్‌ సిబ్బందిని నిలదీయడంతో..

Published : Sep 10, 2022, 02:57 PM IST
గుంటూరు జిల్లాలో మద్యం బాటిల్‌లో పాము పిల్ల.. షాప్‌ సిబ్బందిని నిలదీయడంతో..

సారాంశం

గుంటూరు జిల్లాలో మద్యం బాటిల్‌లో పాము పిల్ల కనిపించడం కలకలం రేపింది. పొన్నూరులో ఈ ఘటన చోటుచేసుకుంది.

గుంటూరు జిల్లాలో మద్యం బాటిల్‌లో పాము పిల్ల కనిపించడం కలకలం రేపింది. పొన్నూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. మద్యం బాటిల్ కొనుగోలు చేసి.. తాగేందుకు మూత తీయగా అందులో పాము పిల్ల కనిపించింది. వివరాలు.. పొన్నూరులోని ఓ షాపు నుంచి కొందరు యువకులు మద్యం బాటిల్ కొనుగోలు చేశారు. అయితే అందులో పాము పిల్ల ఉండటం చూసి తీవ్ర ఆందోళనకు చెందారు. వెంటనే షాపు వద్దు చేరుకుని.. అక్కడి సిబ్బందిని ఇదేమిటని నిలదీశారు. అయితే షాపు నిర్వాహకులు.. ఈ విషయం బయటకు తెలియకుండా వారికి మరో మందు బాటిల్ ఇచ్చి పంపారు. 

అయితే ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. దీంతో పొన్నూరు‌లో మందుబాబులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక, గతంలో ఇదే మద్యం బ్రాండ్ తాగి రేపల్లెలో ఇద్దరు అనుమానస్పదంగా మృతిచెందినట్టుగా చెబుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

ఇది బాబుగారి మాటగా చెబుతున్న | Atchennaidu On Local Body Elections | Asianet News Telugu
Heavy Rain Alert : బంగాళాఖాతంలో తుపాను లోడ్ అవుతోందా? ఈ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలతో అల్లకల్లోలం తప్పదా?