ఇదిగిదిగో... వైసీపీ ప్రభుత్వ నాడు - నేడు: వైసీపీ నేత స్కూల్‌ను ఇంటిగా మార్చేయడంపై చంద్రబాబు ఆగ్రహం..

By Sumanth KanukulaFirst Published Sep 10, 2022, 2:36 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నంద్యాల జిల్లా పాణ్యంలో మూతబడిన ప్రాథమిక పాఠశాలను వైసీపీ నాయకులు ఇల్లుగా మార్చుకోవడానికి సంబంధించి వచ్చిన వార్తలపై చంద్రబాబు ట్విట్టర్‌ వేదికగా స్పందించారు

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నంద్యాల జిల్లా పాణ్యంలో మూతబడిన ప్రాథమిక పాఠశాలను వైసీపీ నేత ఒకరు ఇల్లుగా మార్చుకోవడానికి సంబంధించి వచ్చిన వార్తలపై చంద్రబాబు ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ‘‘ఇదిగిదిగో... వైసీపీ ప్రభుత్వ నాడు - నేడు’’ అంటూ చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం సెటైర్లు వేశారు. ఇక, ప్రభుత్వ పాఠశాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు వైసీపీ ప్రభుత్వం నాడు- నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ నేత ప్రాథమిక పాఠశాలను అక్రమించుకోవడంపై స్పందించిన చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని ఎద్దేవా చేస్తూ ఈ రకమైన విమర్శలు చేశారు. 

అసలేం జరిగిందంటే..
మూతబడిన స్కూల్‌ను ఓ వైసీపీ నేతగా ఇంటిగా మార్చేసుకున్నారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా పాణ్యంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. పాణ్యం ఇందిరానగర్‌‌లో చెంచు గిరిజన్ల కోసం 2013లో రాజీవ్‌ విద్యా మిషన్‌ నిధులతో ప్రాథమిక పాఠశాలను నిర్మించారు. విద్యార్థుల కొరతతో ఐదేళ్ల క్రితం పాఠశాల మూతబడింది. అయితే స్కూల్ మూతబడి ఉండటాన్ని గమనించిన ఓ వైసీపీ నేత దానిని అక్రమించుకున్నాడు. 

 

ఇదిగిదిగో... వైసీపీ ప్రభుత్వ నాడు - నేడు! pic.twitter.com/c1Lskc3jUG

— N Chandrababu Naidu (@ncbn)


స్కూల్ శిలఫలకాన్ని తొలగించి, రంగు మార్చేశాడు. తరగతి గదుల్లోని బ్లాక్ బోర్డును తొలగించి.. వంట రూమ్, బెడ్ రూమ్‌గా మార్చేసుకున్నాడు. మొత్తంగా స్కూల్ రూపురేఖలు మార్చేసి ఇంటిగా మార్చుకున్నాడు. అయితే ఈ వ్యవహారంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం తమకు తెలియదని.. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. 

click me!