మళ్లీ ఛాలెంజ్

First Published Jan 5, 2017, 2:05 AM IST
Highlights

టెండర్ ప్రక్రియలో ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నానని ప్రభుత్వం అనుకుంటోంది.

మనసంతా స్విస్ ఛాలెంజ్ విధానం వైపే. ఎలాగైనా రాజధాని అమరావతి ప్రాంతంలోని స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ పేరుతో 1691 ఎకరాలను సింగపూర్ కపెనీల కన్సార్షియంకే కట్టబెట్టాలన్న పట్టుదల. వెరసి మళ్ళీ వివాదాస్పదమైన రాజధాని స్టారప్ ఏరియా ప్రాజెక్టు అభివృద్ధి కోసం సిఆర్డిఏ స్విస్ ఛాలెంజ్ విధానంలో ప్రభుత్వం టెండర్లను పిలించింది.

 

గతంలో ప్రభుత్వం పిలిచిన టెండర్ల విధానం అత్యంత వివాదాస్పదమవటంతో న్యాయస్ధానంలో సమాధానం చెప్పుకోలేకపోయింది. సింగపూర్ కన్సార్షియం నుండి తనకు అందే ఆదాయ వాటాను ప్రభుత్వం గోప్యంగా ఉంచింది.

 

ఆ గోప్యతను ప్రశ్నిస్తు ఓ నిర్మాణ సంస్ధ హైకోర్టులో కేసు దాఖలు చేయటంతో ప్రభుత్వానికి తలబొప్పి కట్టింది. అయితే విచిత్రంగా ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోకుండా ఏకంగా ఏపీఐడిఈ చట్టాన్నే మార్చేసింది.

 

సింపూర్ కు చెందిన అసెండాస్-సిన్ బ్రిడ్జ్-సమెకార్ప్ లిమిటెడ్ కంపెనీల వైపే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు పలు ఆరోపణలున్నాయి. ఈ దశలో ప్రభుత్వం జారీ చేసిన తాజా నోటిఫికేషన్ తో మళ్ళీ కంపెనీలు టెండర్ ప్రక్రియలో పాల్గొనబోతున్నాయి.

 

అయితే, ఈ సారి బిడ్డింగ్ దాఖలు చేయబోయే కంపెనీల సామర్ధ్యంపైన, సింగపూర్ కంపెనీలు ఇస్తామని చెబుతున్న ఆదాయల వివరాలను వెల్లడించటంపై ముందు జాగ్రత్తగా ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకున్నది.

 

టెండర్ ప్రక్రియలో ఈసారి రెండు దశలను ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హతలు ఉన్నాయో లేదో పరిశీలన మొదటి దశ. మొదటి దశలో అర్హత సాధించిన కంపెనీలకు సింగపూర్ కన్సార్షియం గతంలో తన ప్రతిపదనలో పేర్కొన్న ఆదాయ వాటాను వెల్లడించనున్నట్లు స్పష్టం చేసింది.

 

టెండర్ ప్రక్రియలో ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నానని ప్రభుత్వం అనుకుంటోంది. మరి ఈసారి టెండర్ ప్రక్రియ ఎంత సాఫీగా సాగుతుందో చూడాలి.

click me!