
జయలలలిత మరణం వెనుకున్న మిస్టరీ త్వరలో వీడిపోనుందా? మృతిపై అందరి సందేహాలకు తెరపడుతుందా అన్న చర్చ సర్వత్రా మొదలైంది. ఎందుకంటే, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి దారితీసిన కారణాలను, అందించిన చికిత్స వివరాలపై కదలిక వచ్చింది.
చికిత్సకు సంబంధించిన అన్నీ వివరాలను అందిచాల్సిందిగా చెన్నై హైకోర్టు ప్రభుత్వం, అపోలో ఆసుపత్రికి నోటీసులిచ్చింది. ప్రభుత్వం, ఆసుపత్రి యాజమాన్యం కూడా సీల్డ్ కవర్లో వివరాలను అందచేస్తామంటూ న్యాయస్ధానానికి తెలిపాయి. దాంతో విచారణను వచ్చే నెల 23వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.