
రెండేళ్లయినా అమరావతి కదల లేకపోవచ్చ గాక. ఏడాదిగా పునాది నుంచి లేచేందుకు అగచాట్లు పడుతూ ఉండవచ్చుగాక. అమరావతి పుట్టక ముందే ప్రపంచ స్థాయి రాజధాని అయిపోయింది. ఇది ఎవ్వరూ కాదన లేని సత్యం. ఎలాగంటే,ప్రపంచంలో ఆరు ఖండాల్లో ఉన్న తెలుగు వాళ్లంతా దీనికి డిజిటల్ ఇటుకలు ఇచ్చారు.
తాగా, చిన్న దేశం, కన్నీటి చుక్కలా కనిపించే దేశం శ్రీలంక కూడా అక్కడ గుడారం వేసుకుని అమరావతిని వరల్డ్ క్లాస్ సిటి చేస్తానని ముందు కొచ్చింది. నిన్నమొన్న శ్రీలంక లో తిరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగువాళ్లకు తీసుకువచ్చిన కొలంబో కబురిది.
ఇప్పటికే, అమరావతి కట్టేందుకు ప్రపంచంలోని పేరు మోసిన దేశాలన్నీ ముందుకొచ్చాయి. కొన్ని ఎంవొయులు కూడా చేసుకున్నాయ. చైనా వాళ్లు అమరావతి కడతామన్నారు.(ముఖ్యంగా షాంఘై లాగా అమరావతి ఉండాలనే ముఖ్యమంత్రి కోరిక.) అంతేకాదు, అమరావతి నుంచి అన్ని వైపు స్పీడ్ రైల్లు కూడా నిర్మిస్తామన్నారు.
ఇక సింగపూర్ సంగతి చెప్పనవసరం లేదు. సింగపూర్ కు అంధ్రకు చట్టురికం బాగా కుదిరింది. ఆదేశం మంత్రులు ఒక డజన్ సార్లు వచ్చిపోయారు. ఏడుకొండలవారికి మొక్కుకున్నారు. గోదావరి పుష్కరాలకొచ్చారు. ఆంధ్ర మంత్రులు ఆఫీసర్లు అటు ఇటు తెగతిరిగారు.
తర్వా త మలేషియా వాళ్లు అమరావతి కడతామన్నారు. అమరావతి పరిపాలన చక్కగా చల్లగా సాగేందుకు ఫెమాండ్ అనే పరిపాలనా మంత్రం కూడా నేర్పించారు. జపాన్ ప్రధాని ఏడుకొండల ప్రసాదం స్వీకరించి, టోక్యోలగా అమరావతి తీర్చిదిద్దు తాన్నాడు. తర్వాత టర్కీలోని చారిత్రక పట్టణం కూడా అమరావతికి స్ఫూర్తి దాయకమయింది. ఇస్తాంబుల్ కొద్ది రోజులుండి వచ్చాక, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి ఇస్తాంబుల్ స్టయిల్లో కడతామన్నాడు.
కజ్కిస్తాన్ కూడా అమరావతిలో నిర్మాణానికి రాళ్లెత్తాలనుకుంటూ ఉంది. ముందు ముందు ఇంకాఎన్నిదేశాలు భాగస్వాములవుతాయో చెప్పలేం.
అమరావతి ఆంధ్రవాళ్ల మిని ప్రపంచమయిపోతావుంది. ఈ నేపథ్యంలో వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని ట్వీట్ వ్యంగ్యాస్త్రం ప్రయోగించారు. అంధ్రా అమరావతికొస్తే, మీరిక టోక్యో, సింగపూర్, ఇస్తాంబుల్, కొలంబో తదితర దేశాలు చూడాల్సిన పనేలేద అని అన్నారు.