మావోల డిమాండ్లపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధం: ఎంపీ అవంతి

By Nagaraju TFirst Published Sep 24, 2018, 3:25 PM IST
Highlights

మావోయిస్టులు ప్రజాప్రతినిధులను హతమార్చడం కాకుండా శాంతియుత మార్గంలో ప్రభుత్వంతో చర్చలకు రావాలని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పాడేరులో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతదేహానికి నివాళులర్పించిన ఎంపీ మావోయిస్టుల దాడి దారుణమన్నారు. ప్రజలకోసం పని చేస్తున్న ప్రజాప్రతినిధులను కాల్చిచంపడం మావోయిస్టులకు సరికాదన్నారు. 

విశాఖపట్నం: మావోయిస్టులు ప్రజాప్రతినిధులను హతమార్చడం కాకుండా శాంతియుత మార్గంలో ప్రభుత్వంతో చర్చలకు రావాలని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పాడేరులో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతదేహానికి నివాళులర్పించిన ఎంపీ మావోయిస్టుల దాడి దారుణమన్నారు. ప్రజలకోసం పని చేస్తున్న ప్రజాప్రతినిధులను కాల్చిచంపడం మావోయిస్టులకు సరికాదన్నారు. 

ప్రజలకు సేవ చెయ్యాలని పరితపించే తాము ఎక్కడికైనా వెళ్తామని అలా వెళ్లేటప్పుడు దొంగదెబ్బతీసి చంపడం బాధాకరమన్నారు. ప్రాణం తీసే హక్కు మావోయిస్టులకు ఎక్కడదని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు తప్పులు చేస్తే ప్రజాకోర్టులో దోషులుగా నిలబడతామని తెలిపారు. గిరిజనుల కోసం పనిచేస్తామని చెప్తున్న మావోయిస్టులు గిరిజన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను ఎందుకు చంపారని ప్రశ్నించారు. 

మరోవైపు ఏజెన్సీలో పోలీస్ వ్యవస్థ మరింత మెరుగ్గా పనిచెయ్యాల్సిన అవసరం ఉందని ఎంపీ అవంతి శ్రీనివాస్ సూచించారు. ఏజెన్సీలో మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు జరుగుతున్న తరుణంలో ఏజెన్సీలో పర్యటించొద్దని తాము నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు చెప్తున్నారని ఎంపీ అన్నారు. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ కుటుంబాలను ప్రభుత్వం తరపున, పార్టీ తరపున ఆదుకుంటాని హామీ ఇచ్చారు.  

ఈ వార్తలు కూడా చదవండి

మావోల దాడి దుర్మార్గమైన చర్య: మంత్రి అయ్యన్నపాత్రుడు

కిడారి హత్య... షాక్ లో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి

అరకు ఘటనపై స్పందించిన ఏపీ స్పీకర్ కోడెల

click me!