
విశాఖపట్నం: గిరిజనుల కోసం నిరంతరం పరితపిస్తున్న ఇద్దరు ముఖ్య నాయకులను మావోయిస్టులు కాల్చి చంపడం దుర్మార్గమైన చర్య అని మంత్రి అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. పాడేరులో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మృతదేహానికి నివాళులర్పించిన మంత్రి అయ్యన్న వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న ప్రతీ ఒక్కరు కూడా ఈ దాడిని ఖండించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల మరణం వారి కుటుంబానికి తీరని లోటన్నారు. దాంతోపాటు పార్టీకి కూడా తీరని నష్టం వాటిల్లిందన్నారు. ఇద్దరు నేతల కుటుంబాలకు ప్రభుత్వం పార్టీ అండగా ఉంటుందని వారి కుటుంబాల బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు.
మావోల చేతిలో బలైన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి అయ్యన్నపాత్రుడు హామీ ఇచ్చారు. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో మాట్లాడినట్లు స్ఫష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
అరకు ఘటనపై స్పందించిన ఏపీ స్పీకర్ కోడెల
మావోల డిమాండ్లపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధం: ఎంపీ అవంతి
కిడారికి ముందే పోలీసుల హెచ్చరిక: నోటీసు ఇదే...