విశాఖపట్టణం జిల్లాలోని షీలానగర్ పోర్టు సమీపంలో కారును గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు.
విశాఖపట్టణం: విశాఖపట్టణం జిల్లాలోని షీలానగర్ పోర్టు రోడ్డు మారుతి సర్కిల్ వద్ద పెద్ద ప్రమాదం తప్పింది. మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో రైల్వే ట్రాక్ పై కారు నిలిచిపోయింది.ఈ విషయాన్ని గుర్తించిన గూడ్స్ రైలు లోకో పైలెట్ రైలు వేగాన్ని తగ్గించాడు. కారును తక్కువ వేగంతో రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయమై విశాఖ గాజువాక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రిటైర్డ్ నేవీ అధికారి కుటుంబం విశాఖపట్టణం నగరానికి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్ పై కారు ఉన్న విషయాన్ని గుర్తించి లోకో పైలెట్ రైలును స్లో చేయడంతో ప్రమాదం తప్పింది. లేకపోతే కారులోని వారు ప్రమాదానికి గురయ్యేవారు.
ప్రమాదమని తెలిసిన కూడ రైల్వే ట్రాక్ లపై నిర్లక్ష్యంగా ప్రయాణం చేయడం ప్రమాదాలకు కారణమన అభిప్రాయాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. రైల్వే ట్రాక్ లు దాటే సమయంలో వాహనాలను జాగ్రత్తగా నడపాలి. లేకపోతే ప్రాణాలకు ప్రమాదం జరుగుతంది.ఈ విషయాన్ని పట్టించుకోకుండా వాహనాలు నడుపుతూ ప్రాణాలు పోగోట్టుకుంటున్నారు. విశాఖపట్టణంలో జరిగిన ప్రమాదంలో నలుగురు స్వల్ప గాయాలతో బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.