పుంగనూరు అల్లర్లలో చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదు

Published : Aug 09, 2023, 08:49 AM ISTUpdated : Aug 09, 2023, 09:07 AM IST
పుంగనూరు అల్లర్లలో చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదు

సారాంశం

పుంగనూరు అల్లర్లలో చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదయ్యింది.   

అమరావతి : పుంగనూరు అల్లర్లలో చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. ముదివీడు పీఎస్ లో కేసు నమోదయ్యింది. ఏ1గా చంద్రాబాబు. ఏ2గా దేవినేని ఉమ ను, ఏ3గా అమర్నాథ్ లను చేర్చారు. అన్ని కేసుల్లోనూ ఏ1గా చల్లాబాబును చేర్చారు. దీంతో పాటు మరో 2 కేసులు కూడా నమోదయ్యాయి. గతవారం పుంగనూరులో చంద్రబాబు రోడ్ షో సందర్భంగా జరిగిన అల్లర్లలో 50మంది పోలీసులు గాయపడిన సంగతితెలిసిందే. దీనిమీద టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది.  

డాక్టర్ ఉమాపతి రెడ్డి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. నేరం చేయడానికి ప్రేరేపించడం, హాని చేయడం కోసం, హత్యాప్రయత్నం కోసమే రెచ్చగొట్టారని తెలిపారు. అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశ్యంతోనే రెచ్చగొట్టారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఈ నెల 4వ తేదీన అంగుళ్లలో జరిగిన సభలో.. ఆ వీధి గుండా వెడుతూ.. కుట్రపూరితంగా దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. అల్లర్లకు సంబంధించిన డిటైల్డ్ ఫుటేజ్ నుకూడా ఉమాపతిరెడ్డి పోలీసులకు ఇచ్చారు. 


 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు