తమ ప్రభుత్వ హయంలో ఎలాంటి మైనింగ్ అక్రమాలు చోటు చేసుకోలేదని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. గురువారం నాడు ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు చేసిన ఆరోపణలను ఆయన తప్పుబట్టారు.
తిరుపతి: రిషికొండలో తమ ప్రభుత్వం హయంలో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదని ఏపీ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. గురువారం నాడు ఏపీ మంత్రి Peddireddy Ramachandra reddy తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. TDP చీఫ్ ChandrababuNaidu రిషికొండలో అక్రమాలు చోటు చేసుకొన్నాయని చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు.చంద్రబాబునాయుడు తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కుప్పం నియోజకవర్గంలో తాము దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నామని చంద్రబాబు చేసిన విమర్శలను ఆయన ఖండించారు. తాము దాడులు దౌర్జన్యాలు చేస్తే కుప్పంలో చంద్రబాబునాయుడు ఇన్ని దఫాలు విజయం సాధించేవాడా అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గంలో టీడీపీకి చెందిన నేతలే రౌడీయిజం చేస్తారని ఆయన చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే రాష్ట్రంలో అనేక అక్రమాలు జరిగాయని ఆయన చెప్పారు. ఈ అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకొంటున్నామని మంత్రి వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేస్తుందన్నారు. చంద్రబాబు సర్కార్ మాదిరిగా ప్రజలపై బారాలు మోపే కార్యక్రమాలు తీసుకోలేదన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన Manifesto లో హామీలను తమ ప్రభుత్వం 95 శాతం హామీలు నెరవేర్చిందని చెప్పారు.