కరోనా ఎఫెక్ట్: విజయవాడ గొల్లపూడి మార్కెట్ నేటి నుండి ఆరు రోజులు మూసివేత

By narsimha lodeFirst Published Jul 13, 2020, 4:34 PM IST
Highlights

కరోనా ఎఫెక్ట్ తో ఆరు రోజుల పాటు ఈ నెల 13వ తేదీ నుండి ఈ నెల 20వ తేదీ వరకు  గొల్లపూడి మార్కెట్ ను మూసివేయాలని వ్యాపారులు నిర్ణయం తీసుకొన్నారు.

విజయవాడ: కరోనా ఎఫెక్ట్ తో ఆరు రోజుల పాటు ఈ నెల 13వ తేదీ నుండి ఈ నెల 20వ తేదీ వరకు  గొల్లపూడి మార్కెట్ ను మూసివేయాలని వ్యాపారులు నిర్ణయం తీసుకొన్నారు.

కరోనా ఎఫెక్ట్ తో గొల్లపూడి మార్కెట్ ను మూసివేయాలని వ్యాపారులు నిర్ణయం తీసుకొన్నారు. ఇప్పటికే ఈ మార్కెట్ ోని పలు వ్యాపారులకు కరోనా సోకింది. ఈ మార్కెట్ నుండి ఇతర రాష్ట్రాలకు పలు సరుకులు ఎగుమతులు, దిగుమతులు అవుతుంటాయి. విజయవాడలో కరోనా కేసులు ఎక్కువగా నమోదౌతున్నాయి. ఈ మార్కెట్ కు ఇతర ప్రాంతాల నుండి వ్యాపారులు వస్తుంటారు.

also read:బీహార్ వ్యాపారి రాజ్‌కుమార్ గుప్తా అంత్యక్రియలు: 20 మందికి కరోనా

కరోనా కేసులను నిరోధించేందుకు వీలుగా  ఆరు రోజుల పాటు ఈ మార్కెట్ ను మూసివేయాలని అసోసియేషన్ నిర్ణయం తీసుకొంది. మార్కెట్ ను మూసివేయడం ద్వారా కొంతలో కొంతైనా కరోనా కేసులను తగ్గించేందుకు వీలౌతోందని అసోసియేషన్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.

ఈ మార్కెట్ లో సుమారు 500 దుకాణాలు ఉంటాయి.ఈ మార్కెట్ లోని దుకాణాలన్నీ హోల్ సేల్ వ్యాపారం నిర్వహిస్తుంటాయి.  కరోనా కేసుల నివారణకు గాను వ్యాపారులు స్వచ్చంధంగా ఆరు రోజుల పాటు దుకాణాలను మూసివేయాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా  అసోసియేషన్ మెంబర్ అరవింద్ తెలిపారు.

 

click me!