ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఖాళీల భర్తీ...అతి త్వరలో: వైద్య మంత్రి ఆదేశం

By Arun Kumar PFirst Published Jul 13, 2020, 1:00 PM IST
Highlights

ఏజెన్సీ ప్రాంతాల్లోని అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్స్ అందుబాటులో ఉండాలని ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అదేశించారు. 

పోలవరం: ఏజెన్సీ ప్రాంతాల్లోని అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్స్ అందుబాటులో ఉండాలని ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అదేశించారు.  హాస్పిటల్స్ ఖాళీగా ఉన్న మెడికల్ సిబ్బంది పోస్టులు వెంటనే భర్తీ చేయాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలు రాజు కు మంత్రి అదేశించారు. 

 పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలోని బుట్టాయిగూడెం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను మంత్రి నాని తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఏజెన్సీ లో వెంటనే మొబైల్ ఎక్సరే యూనిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

బుట్టాయిగూడెంలో 10ఎకరాలు స్థలంలో 75కోట్లు రూపాయలతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 7 ఐటిడిఏ పరిధిలో మల్లీ స్పెషలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే ఇప్పటికే కోవిడ్ -19 చికిత్స ను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగిందన్నారు. 

read more  గాంధీ భవన్ లో కరోనా టెన్షన్... కాంగ్రెస్ సీనియర్ నాయకుడి మృతితో

రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు 11,400కోట్లు రూపాయలు కేటాయించడం జరిగిందని... రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక్కొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండగా.. అదనంగా మరో 16 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. 

అనంతరం మంత్రి బుట్టాయిగూడం కమ్యూనిటీ హాస్పిటల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలు రాజు, ఐటిడిఏ పిఓ సూర్యనారాయణ, డీఎంఆండ్‌హెచ్‌వో డాక్టర్ సునంద, డిసిహెచ్ డాక్టర్ శంకర్ రావు, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మామిళ్ల పల్లి జయ ప్రకాష్, ఏపి మెడికల్ కౌన్సిల్ బోర్డు మెంబర్ డాక్టర్ దిరిశాల వరప్రసాద్ రావు,జంగారెడ్డిగూడెం ఆర్డీవో ప్రసన్న లక్ష్మి పాల్గొన్నారు. 


 

click me!