పితాని తనయుడు సురేష్‌కు చుక్కెదురు: ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు

Published : Jul 13, 2020, 02:32 PM IST
పితాని తనయుడు సురేష్‌కు చుక్కెదురు: ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు

సారాంశం

మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తనయుడు పితాని సురేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు సోమవారం నాడు తిరస్కరించింది.

అమరావతి: మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తనయుడు పితాని సురేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు సోమవారం నాడు తిరస్కరించింది.

ఈఎస్ఐ స్కాం విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ  మంత్రి పితాని సురేష్ , మాజీ పీఎస్ మురళీమోహన్ లు ముందస్తు బెయిల్ పిటిషన్లను ఈ నెల 9వ తేదీన హైకోర్టులో దాఖలు చేశారు.

ఈ  నెల 10వ తేదీన పితాని సత్యనారాయణ మాజీ పీఎస్ మురళీమోహన్ ను ఏసీబీ అధికారులు  సచివాలయంలో అరెస్ట్ చేశారు. అదే రోజు నుండి పితాని సురేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సురేష్ హైద్రాబాద్ లో ఉన్నట్టుగా సమాచారం రావడంతో ఏసీబీ అధికారుల బృందం హైద్రాబాద్ లో కూడ సురేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ముందస్తు బెయిల్ పిటిషన్లపై సోమవారం నాడు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది.

also read:ఏపీ ఈఎస్ఐ స్కాం: పితాని కొడుకు సురేష్ కోసం ఏసీబీ గాలింపు

ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో పితాని సురేష్ ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది.మరో వైపు  ఈ కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ స్పష్టం చేశారు.ఉద్దేశ్యపూర్వకంగానే తమ కుటుంబంపై ఈ కేసును రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఇదే కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన గుంటూరులోని రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Vizag Police Commissioner: తాగి రోడ్డెక్కితే జైలుకే విశాఖ పోలీస్ హెచ్చరిక | Asianet News Telugu