తాడిపత్రి బాగు కోసం వంద కోట్లు ఇవ్వండి.. వెంటనే రాజీనామా చేస్తా - జేసీ ప్రభాకర్ రెడ్డి

By Asianet NewsFirst Published Aug 17, 2023, 2:34 PM IST
Highlights

తాడిపత్రి డెవలప్ మెంట్ కోసం రూ.వంద కోట్లు మంజూరు చేస్తే తాను మున్సిపల్ చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటానని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. తాడిపత్రిలో ఇసుక తరలింపు జరగకూడదని అన్నారు. గ్రీన్  ట్రిబ్యునల్, కోర్టు తీర్పుల ప్రకారం ఇసుక తరలింపును ఆపాలని కోరారు. 

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీపై, స్థానిక అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.  మున్సిపాలిటీ అభివృద్ధి కోసం వంద కోట్ల రూపాయిలు మంజూరు చేస్తే తన పదవిని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మున్సిపాలిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆర్టీసీ విలీనం బిల్లు పెండింగ్: తమిళిసైపై కార్మికుల గుస్సా 

తాడిపత్రి మున్సిపాలిటీని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దోచుకుంటున్నారని ప్రభాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పోలీస్ స్టేషన్ నిర్మించాలని మున్సిపాలిటీ స్థలాన్ని తీసుకుంటున్నారని తెలిపారు. అది సరైంది కాదని అన్నారు. ఆ స్థలంలో పోలీస్ స్టేషన్ కడితే ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని చెప్పారు. ఎలాంటి పర్మిషన్లు లేకుండానే.. జిల్లా ఎస్పీ అధికార పార్టీ ఆడించినట్టు ఆడుతున్నారని ఆరోపణలు చేశారు. ఇలా మాట్లాడుతున్నందుకు తన మీద కక్ష పెట్టుకోకూడదని ఎస్పీని ఆయన కోరారు.

పైకి చూస్తే స్పా సెంటర్ బోర్డు.. లోపల నడిచేది వ్యభిచారం.. గుట్టురట్టు చేసిన పోలీసులు..

ఎమ్మెల్యేకు చెందిన వ్యక్తులకు మార్కెట్ లో షాప్ లు కేటాయించారని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి కౌన్సిలర్ రాబర్ట్ ను వైసీపీలో చేర్చుకున్నారని చెప్పారు. ఆయనకు మున్సిపాలిటీకి చెందిన స్థలాన్ని ఇచ్చారని, అందులో ఒక బిర్యానీ సెంటర్ ఏర్పాటు చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం జిల్లా కలెక్టర్, ఎస్పీ దృష్టికి తెలిసినా కూడా పట్టించుకోవడం లేదని తెలిపారు. 

ఇస్లాం కంటే హిందూ మతం చాలా పురాతనమైంది.. భారత ముస్లింలు మొదట హిందువులే - గులాం నబీ ఆజాద్

ఇసుక తరలింపు విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ఇసుక తరలించకూడదని అని గ్రీన్ ట్రిబ్యునల్, కోర్టు తీర్పులు ఇచ్చాయని ఆయన గుర్తు చేశారు. అయినా కూడా ఇక్కడి నుంచి యథేచ్చగా తరలింపు జరుగుతోందని ఆరోపించారు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదా అని ప్రశ్నించారు. తాడిపత్రి అంటే తన ఇళ్లు అని, దాని కోసం ప్రాణాలు అయినా ఇస్తానని తెలిపారు.

తాజా సర్వే: ఏపీలో జగన్ హవా, చంద్రబాబు గాలి నామమాత్రమే

ఎస్పీకి తన మాటలు బాధపెట్టవచ్చని అని అన్నారు. కానీ ఎవరికి భయపడి ఇసుక తరలింపు వాహనాలను సీజ్ చేయడం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఇక్కడి నుంచి ఇసుక తరలించడాన్ని కచ్చితంగా నిలుపుదల చేయాల్సిందే అని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని సీఎం చేసేందుకు ఎవరి కాళ్లయినా మొక్కుతామని అన్నారు. 

click me!