తాగిన మైకంలో స్నేహితుల గొడవ... కత్తిపోట్లతో యువకుడు దుర్మరణం (వీడియో)

Published : Aug 17, 2023, 01:59 PM ISTUpdated : Aug 17, 2023, 02:01 PM IST
తాగిన మైకంలో స్నేహితుల గొడవ... కత్తిపోట్లతో యువకుడు దుర్మరణం (వీడియో)

సారాంశం

ఫుల్లుగా మందుకొట్టిన స్నేహితుల మధ్య జరిగిన గొడవలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన దారుణం కృష్ణా జిల్లాలో జరిగింది. 

మచిలీపట్నం : మద్యంమత్తులో స్నేహితుల మధ్య గొడవ జరిగి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఫుల్లుగా మందుతాగి బార్ వద్దే ఘర్షణకు దిగిన యువకులు కత్తులతో వీరంగం సృష్టించారు. చివరకు ఈ గొడవలో ఓ యువకుడు కత్తిపోట్లకు గురయి మృతిచెందాడు. ఈ దారుణం కృష్ణా జిల్లాలో జరిగింది. 

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం తాడిగడపకు చెందిన యువకులు ఎల్లారెడ్డి, అనిల్, రఫీ, బాషా, యకరం స్నేహితులు. వీరంతా కలిసి స్థానికంగా వున్న హ్యాపీ బార్ ఆండ్ రెస్టారెంట్ లో మద్యం సేవించారు. ఫుల్లుగా మందుకొట్టి మత్తులో వున్న స్నేహితుల మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. ఘర్షణకు దిగిన స్నేహితులు కత్తులతో హల్ చేస్తుండగా సముదాయించడానికి  రఫీ(32) ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడు కత్తిపోటుకు గురయ్యాడు. 

వీడియో

తీవ్ర రక్తస్రావంతో బార్ వద్దే పడిపోయిన రఫీని పెనమలూరు హాస్పిటల్ కు తరలించారు. అతడి పరిస్థితి విషమంగా వుండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రఫీ మృతిచెందాడు. ఈ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రఫీపై కత్తితో దాడిచేసిన యువకుల కోసం గాలిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే