(వీడియో) బోరుబావిలో పడిన చిన్నారి మృతి

First Published Jun 24, 2017, 8:12 PM IST
Highlights

48 గంటలైన తర్వాత కనీసం మీనా విజువల్స్ అయినా లభించాయి. మృతదేహాన్ని బయటకు తీయటానికే ప్రభుత్వం అవస్తలు పడుతోంది.

రంగారెడ్డి జిల్లాలోని ఇక్కారెడ్డిగూడెం గ్రామంలో బోరు బావిలో పడిపోయిన చిన్నారి ఇకలేదు. 48 గంటలైన తర్వాత కనీసం మీనా విజువల్స్ అయినా లభించాయి. మృతదేహాన్ని బయటకు తీయటానికే ప్రభుత్వం అవస్తలు పడుతోంది. సాయంత్రం వరకూ బోరుబావిలో పడిపోయిన చిన్నారి వీడియోలు తీద్దామని ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా మధ్యాహ్నం వరకూ సాధ్యం కాలేదు. అయితే, ముంబాయి నుండి తెప్పించిన అధునాతన కెమెరాలతో చివరకు కొద్దిపాటి విజువల్స్ సాధ్యంమైంది.                                                                                  

దాదాపు 230 అడుగుల లోపలకు చిన్నారి పడిపోయింది. చిన్నారిని బయటకు తెచ్చేందుకు ప్రభుత్వం తన శాయశక్తులా ప్రయత్నాలు చేస్తోంది. చిన్నారి ఉదంతాన్ని ప్రభుత్వం ఒక గుణపాఠంగా తీసుకుని నోళ్ళు తెరుచుకున్న బోరుబావులన్నింటినీ మూతలు బిగిస్తే బాగుంటుంది.

click me!