అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఎందుకు వెనకాడుతున్నారని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఆయన ఎపిసోడ్ సస్పెన్స్ థ్రిల్లర్ లా ఉందంటూ విమర్శించారు.
విశాఖపట్నం : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి మీద మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శలు చేశారు. అవినాష్ రెడ్డి ఎపిసోడ్ సస్పెన్స్ థ్రిల్లర్ లా ఉందన్నారు. ఆయనను అరెస్ట్ చేయడానికి సీబీఐ మీనామేషాలు ఎందుకు లెక్కిస్తోందని ప్రశ్నించారు. అవినాష్ రెడ్డి తల్లికి అంతగా ఆరోగ్యం బాగోలేకపోతే హైదరాబాద్ కు ఎందుకు తీసుకువెళ్లలేదని ప్రశ్నించారు. కడపలో ఎందుకు వైద్యం అందిస్తున్నారని అడిగారు.
అవినాష్ రెడ్డి విచారణ మీద సజ్జల వ్యాఖ్యలను కూడా ఆయన తప్పుపట్టారు..అవినాష్ రెడ్డి ఆరుసార్లు సీబీఐ విచారణకు వెళ్ళాడని చెప్పుకుంటున్నారు అన్నారు. ఎన్నిసార్లు హాజరు కాలేదో కూడా సజ్జల చెప్పాలని గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మే 27న ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెళ్లబోతున్నాడని.. అయితే, ఈ టూర్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదన్నారు. కేవలం అవినాష్ రెడ్డి కోసమే ఢిల్లీ టూర్ అన్నారు.
undefined
సీఎం జగన్ అక్రమ సంపాదన అంతా అవినాష్ చేతిలోనే.. అరెస్ట్ అడ్డుకుంటుంది అందుకే : బీటెక్ రవి
దీంతోపాటు.. ఆర్బీఐ ఇటీవల ప్రకటించిన రూ.2వేల నోట్ల రద్దును స్వాగతిస్తున్నామని గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆ నోట్లు దగ్గర ఉన్నవాళ్లకు ఇబ్బందులని అన్నారు. ఇక మహానాడుకు వేసిన కమిటీలో తనకు చోటు లేకపోవడం మీద వేసిన ప్రశ్నకు.. గంటా సమాధానాన్ని దాటేశారు. తాను సూటబుల్ కాదనుకున్నారేమో అంటూ సున్నితంగా దాటవేశారు.