ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం: మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్

Published : May 24, 2023, 03:11 PM ISTUpdated : May 24, 2023, 03:23 PM IST
ఏవీ  సుబ్బారెడ్డిపై హత్యాయత్నం:   మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్

సారాంశం

మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు కర్నూల్  కోర్టు  బుధవారంనాడు బెయిల్  మంజూరు చేసింది. 

కర్నూల్: మాజీ మంత్రి  భూమా  అఖిలప్రియకు  బుధవారంనాడు  కర్నూల్  కోర్టు  బెయిల్  మంజూరు  చేసింది .  టీడీపీ నేత  ఏవీ సుబ్బారెడ్డిపై దాడి  కేసులో  భూమా అఖిలప్రియ ఆమె భర్త భార్గవరాముడిని  పోలీసులు  అరెస్ట్  చేశారు.  వీరిద్దరికి  కోర్టు  రిమాండ్ విధించింది.  అయితే  భూమా అఖిలప్రియ  బెయిల్ పిటిషన్ దాఖలు  చేసింది.  ఈ పిటిషన్ పై విచారించిన  కర్నూల్  కోర్టు  భూమా అఖిలప్రియ కు బుధవారంనాడు   బెయిల్   మంజూరు  చేసింది.  బెయిల్ పత్రాలతో  నంద్యాలకు  బయలుదేరారు  భూమా అఖిలప్రియ న్యాయవాదులు. బెయిల్ పత్రాలను  జైలులో అందిస్తే  ఇవాళ సాయంత్రం  జైలు నుండి  భూమా అఖిలప్రియ  విడుదలయ్యే అవకాశం  ఉంది. 

టీడీపీ జాతీయ  ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్  యువగళం పాదయాత్ర   నంద్యాలకు  చేరుకున్న  సమయంలో  ఈ ఘటన  చోటు  చేసుకుంది. ఈ నెల  16వ  తేదీన  భూమా అఖిలప్రియ  వర్గీయులు ఏవీ సుబ్బారెడ్డిపై దాడి  చేశారు.  తన చున్నీ లాగడంతో  ఏవీ సుబ్బారెడ్డిపై  దాడి  చేసినట్టుగా  భూమా అఖిలప్రియ  చెబుతున్నారు.  భూమా అఖిలప్రియ వర్గీయుల దాడిపై  ఏవీ సుబ్బారెడ్డి  పోలీసులకు  ఫిర్యాదు  చేశారు.  

ఇరువర్గాల  ఫిర్యాదుపై  పోలీసులు   కేసు నమోదు  చేశారు.ఈ నెల  17న భూమా అఖిలప్రియ  ఆమె భర్త భార్గవరాముడిని  పోలీసులు అరెస్ట్  చేశారు. కోర్టులో హాజరుపర్చారు. అయితే వీరిద్దరికి  14 రోజుల పాటు రిమాండ్  విధించింది  కోర్టు.    మాజీ మంత్రి  భూమా అఖిలప్రియ  బెయిల్  కోసం  కర్నూల్  కోర్టును  ఆశ్రయించారు.  ఈ విషయమై  విచారణ  నిర్వహించి న  కోర్టు  భూమా అఖిలప్రియకు  బెయిల్ ను మంజూరు చేసింది. 

PREV
click me!

Recommended Stories

ఇఫ్తార్ విందులో పాల్గొన్న జగన్ | YS Jagan Attends Iftar Dinner | Asianet News Telugu
దివ్యాంగులతో టికెట్ తీసుకొని బస్సులో ప్రయాణించిన సీఎం | Divyang Shakti Scheme | Asianet News Telugu