మా మాజీ బాస్ ఆ విషయంలో దిట్ట.. బాలకృష్ణ సినిమా డైలాగులు రాజకీయంలో పనిచేయవు: ఎమ్మెల్యే వంశీ

Published : Mar 24, 2023, 12:58 PM IST
మా మాజీ బాస్ ఆ విషయంలో దిట్ట.. బాలకృష్ణ సినిమా డైలాగులు రాజకీయంలో పనిచేయవు: ఎమ్మెల్యే వంశీ

సారాంశం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో దిట్ట అని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విమర్శించారు. ఆయన  తెలంగాణలో స్టీపెన్‌ను కొనుగోలు చేస్తూ పట్టుబడిన సంగతి అందరికీ  తెలుసునని అన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో దిట్ట అని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విమర్శించారు. ఆయన  తెలంగాణలో స్టీపెన్‌ను కొనుగోలు చేస్తూ పట్టుబడిన సంగతి అందరికీ  తెలుసునని అన్నారు. ఏపీ ఎమ్మెల్సీ  ఎన్నికల ఫలితాలపై వంశీ  స్పందిస్తూ.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘మా మాజీ బాస్ డబ్బులు ఆశచూపి కొనుగోలు చేయడంలో ఎక్స్‌పర్ట్’’ అని కామెంట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నలుగురిని కొనుగోలు చేసినట్టుగా తేలిందని.. అందుకే ఆ పార్టీ గెలిచిందని అన్నారు. ఓటుకు నోటు కేసులో పట్టుబడి అర్దరాత్రి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. ప్రలోభ పెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి చంద్రబాబు గెలిచాడని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో సీట్లు రాని ఆ నలుగురు ఎమ్మెల్యేలతో చంద్రబాబు బేరం కుదుర్చుకున్నారని అన్నారు. చంద్రబాబుకు మైండ్ గేమ్ ఆడటం అలవాటని విమర్శించారు. టీడీపీకి ఓటు వేసింది ఎవరనేది వైసీపీ అధిష్టానం గుర్తించిందని అన్నారు. 

మొన్న తెలంగాణలో అధికారంలోకి వస్తామని టీడీపీ చెప్పిందని.. ఇప్పుడు ఏపీలో 175 స్థానాల్లో గెలుస్తామని చెబుతోందని విమర్శలు గుప్పించారు. టీడీపీ జరిగేవి చెప్పాలని అన్నారు.  బాలకృష్ణ సినిమా డైలాగులు రాజకీయంలో పనిచేయవని అన్నారు. సినిమాలో డూపులు అమర్చినట్టుగా వారి మాటలు  కూడా డూపులేనని విమర్శించారు. సినిమాకు, రాజకీయానికి చాలా తేడా ఉందని అన్నారు. సార్వత్రిక, సాధారణ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది అందరూ చూశారని చెప్పారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ వైసీపీదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు