గన్నవరం ఇక ఎన్టీఆర్ విమానాశ్రయం

Published : Jan 12, 2017, 09:24 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
గన్నవరం ఇక ఎన్టీఆర్ విమానాశ్రయం

సారాంశం

చంద్రబాబు మాట్లాడుతూ విమానాశ్రయానికి ఎన్టీఆర్-అమరావతి విమానాశ్రయంగా పేరు ఖరారు చేయాలంటూ పౌర విమానయాన శాఖ మంత్రి, ఉన్నతాధికారులను కోరారు.

గన్నవరం విమానాశ్రయంకు ఎన్టీఆర్-అమరావతి విమానాశ్రయంగా నామకరణం జరిగింది. శుక్రవారం విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన అంతర్జాతీయ  టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 

 

ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ గన్నవరం విమానాశ్రయం పేరును ఎన్టీఆర్ విమానాశ్రయంగా మారుస్తున్నట్లు చెప్పారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ విమానాశ్రయానికి ఎన్టీఆర్-అమరావతి విమానాశ్రయంగా పేరు ఖరారు చేయాలంటూ పౌర విమానయాన శాఖ మంత్రి, ఉన్నతాధికారులను కోరారు. కేంద్రమంత్రి, ముఖ్యమంత్రి ఇద్దరూ విజ్ఞప్తి చేసారు కాబట్టి ఇకనుండి గన్నవరం విమానాశ్రయాన్ని ఎన్టీఆర్-అమరావతి విమానాశ్రయంగా పిలవటం ఖాయం.

 

హైదరాబాద్ లో కట్టినపుడు శంషాబాద్ విమానాశ్రయంలో ఓ టెర్మినల్ కు చంద్రబాబు సిఎంగా ఉన్నపుడే ఎన్టీఆర్ టెర్మినల్ గా పేరు పెట్టారు. అయితే, ఆ తర్వాత సిఎం అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొత్తం విమానాశ్రయం పేరునే రాజీవ్ గాంధి అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చారు. దాంతో అప్పటి నుండి ఎన్టీఆర్ పేరుతో రాష్ట్రంలోని ఏ విమానాశ్రయంలోనూ టెర్మినల్ లేదు. అయితే, తాజా ప్రతిపాదనతో మళ్ళీ ఎన్టీఆర్ పేరు ఖాయమైంది.

 

అదే సమయంలో చంద్రబాబు ప్రసంగిస్తూ, జిల్లాకో విమానాశ్రయం ఏర్పాటు కావాలన్నారు. జిల్లాల మధ్య రాకపోకలు సులభతరం కావాలంటే ప్రతీ జిల్లాలోనూ ఓ విమానాశ్రయం ఉండాలన్నది చంద్రబాబు విజన్. అలాగే, నెల్లూరు జిల్లాలోని దగదర్తి వద్ద విమానాశ్రయం ఏర్పాటు చేసేబదులు కృష్ణపట్నం వద్ద ఏర్పాటు చేస్తే అన్నీ విధాలుగా లాభదాయకమని సూచించారు.

 

 ఈ కార్యక్రమంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, వెంకయ్యనాయడు, సురేష్ ప్రభు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, బండారు దత్తాత్రేయ, సుజనా చౌదరితో పాటు పలువురు ఎంపిలు, స్పీకర్ కోడెల శివప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

 

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?